Anand Mahindra: మహీంద్ర వాహనాల స్పీడ్‌ ముందు వరదలు కూడా బలాదూర్‌.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.

Anand Mahindra: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్తలో మహీంద్ర కంపెనీ అధిపతి ఆనంద్‌ మహీంద్ర ఒకరు. సమాజంలో జరుగే అంశాలపై, ఫన్నీ వీడియోలు, ఆశ్చర్యకరమైన విషయాలు..

Anand Mahindra: మహీంద్ర వాహనాల స్పీడ్‌ ముందు వరదలు కూడా బలాదూర్‌.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 3:48 PM

Anand Mahindra: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్తలో మహీంద్ర కంపెనీ అధిపతి ఆనంద్‌ మహీంద్ర ఒకరు. సమాజంలో జరుగే అంశాలపై, ఫన్నీ వీడియోలు, ఆశ్చర్యకరమైన విషయాలు.. ఇలా ఏదో ఒక అంశంపై స్పందిస్తుంటారు ఆనంద్‌. ఈ క్రమంలోనే ఆయన చేసే కొన్ని ట్వీట్లు అప్పుడప్పుడు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా అలాంటి ఓ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొన్ని రోజుల క్రితం గుజరాత్‌లో భారీగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డన్నీ చెరువులను తలపించాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌ పట్టణం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. రోడ్లపై నీరు వాగులను తలపించింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ అక్కడి పోలీసులు రెస్క్యూ కోసం వరద నీటిలో కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆనంద్‌.. ‘మహీంద్రాకు ఇది సాధ్యమే’ అని క్యాప్షన్‌ జోడించారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహీంద్ర కంపెనీకి చెందిన థార్‌ జీప్‌ను ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తోన్న ఓ నదిని దాటించాడు. ఒకవైపు నుంచి మరో వైపునకు వెళ్లడమేకాకుండా మళ్లీ రిట్నర్‌ వచ్చాడు. అయితే అంత నీటి ఉధృతిని తట్టుకొని సైతం కారు వెళ్లడం విశేషం. దీంతో ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఆనంద్‌.. ‘గుజరాత్‌లో బొలేరో కారు వరదలో ప్రవహించిన వీడియో వైరల్‌గా మారిన తర్వాత కొందరు నాకు ఈ వీడియోను పంపించారు. బహుశా మహీంద్రా వాహనాలకు ‘ఉభయచర వాహనాలు’ అని పేరు పెడితే బాగుంటేదేమో’ అని ఫన్నీగా ట్వీట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరి మహీంద్ర థార్‌ నీటి ప్రవాహాన్ని ఎలా తట్టుకొని వెళుతుందో మీరూ చూసేయండి.

Also Read: Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్

Prabhas: మరోసారి జక్కన్న దర్శకత్వంలో బాహుబలి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బడా నిర్మాణ సంస్థ కసరత్తులు..

Saidabad Raju Death: సైదాబాద్‌ రాజు ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏం జరిగింది.? ప్రత్యక్ష సాక్ష్యులు ఏమని చెప్పారంటే..