AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మరోసారి జక్కన్న దర్శకత్వంలో బాహుబలి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బడా నిర్మాణ సంస్థ కసరత్తులు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో

Prabhas: మరోసారి  జక్కన్న దర్శకత్వంలో బాహుబలి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బడా నిర్మాణ సంస్థ కసరత్తులు..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2021 | 3:11 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో డార్లింగ్ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు..అంతేకాదు.. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటనకు.. జక్కన తెరకెక్కించిన తీరుకు దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లోనూ వీరిద్దరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చత్రపతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కించిన బాహుబలి కూడా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు..ఈ నేపథ్యంలో రాజమౌళి.. ప్రభాస్ కలయికలో మరో సినిమా రాబోతుందని టాక్ నడుస్తోంది.

దర్శధీరుడు రాజమౌళి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక గతవారం క్రితం మైత్రీ మూవీ మేకర్స్.. డైరెక్టర్ రాజమౌళిని కలిశారట. దీంతో మరోసారి బాహుబలి కాంబో రిపీట్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజమౌళి, ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో అదిపురుష్ మూవీ చేస్తున్నాడు. అలాగే ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Jagapathi Babu: వీటి నుంచే నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుంది.. మనుషులు తెలుసుకోవాలి.. జగ్గూభాయ్ ఆసక్తికర ట్వీట్..

Anasuya Bharadwaj Photos: అల్లరి.. అందంతో ఆకట్టుకుంటున్న అనసూయ న్యూ ఫొటోస్..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..