Jagapathi Babu: వీటి నుంచే నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుంది.. మనుషులు తెలుసుకోవాలి.. జగ్గూభాయ్ ఆసక్తికర ట్వీట్..

ఒకప్పుడు జగపతి బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఫేవరేట్ హీరో. స్టార్ హీరోలలో ఒకరిగా కొన్ని ఏళ్ల పాటు కొనసాగాడు. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను

Jagapathi Babu: వీటి నుంచే నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుంది.. మనుషులు తెలుసుకోవాలి.. జగ్గూభాయ్ ఆసక్తికర ట్వీట్..
Jagapathi Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 2:26 PM

ఒకప్పుడు జగపతి బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్‏కు ఫేవరేట్ హీరో. స్టార్ హీరోలలో ఒకరిగా కొన్ని ఏళ్ల పాటు కొనసాగాడు. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను చేసేందుకు జగ్గూభాయ్ ముందుండేవారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అనుహ్యాంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక కొంత కాలం తర్వాత గ్యాప్ విలన్ గెటప్‏లో రీంట్రీ ఇచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో తిరిగి వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు.

లెజెండ్ సినిమాలో జగ్గూభాయ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత జగపతి బాబు వరుసగా.. విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం జగ్గూభాయ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మహా సముద్రం మూవీలోనూ కనిపించనున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న రిపబ్లిక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా జగ్గూభాయ్.. తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశాడు.

సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో జగ్గుభాయ్ అమెరికాకు వెళ్లిపోయారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేసిన ఆయన.. తన కుటుంబంతో..తనకు ఇష్టమైన పెట్స్‏తో.. ఇంకా తన పుస్తకాలతో సరదాగా సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పెంపుడు జంతువులది స్వార్థం లేని ప్రేమ అని.. బుక్స్, పెట్స్.. చాలా బెస్ట్ అని.. మనుషులు వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలంటూ ట్వీట్ చేశారు జగ్గూభాయ్.

ట్వీట్..

Also Read: Saptagiri : సప్తగిరి ‘గూడుపుఠాణి’.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..