Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఆ కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం ఊరటనిచ్చిందన్న మెగాస్టార్ చిరంజీవి..

అభం శుభం తెలియని ఆరేళ్ళ పసిపాప పై ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నెర్ర జేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని..

Chiranjeevi: ఆ కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం ఊరటనిచ్చిందన్న మెగాస్టార్ చిరంజీవి..
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2021 | 1:36 PM

Chiranjeevi: అభం శుభం తెలియని ఆరేళ్ళ పసిపాప పై ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నెర్రజేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని.. ముక్తకంఠంతో నినదించారు. ప్రజల నినాదం దేవుడికి వినిపించిందేమో ఆ కిరాతకుడు శవమై తేలాడు. ఆత్మహత్య చేసుకొని నిర్జీవంగా రైలు పట్టాలపై పడి ఉన్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్న‌ట్లు లోకో పైల‌ట్ పోలీసుల‌కు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే ప‌చ్చ‌బొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు. ఇక రాజు మరణం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికి ఇలా శవమై కనిపించాడు.

రాజు ఆత్మహత్య చేసుకోవడం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారి పై హత్యాచారానికి పాలుపడిన కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరటను కలిగిస్తుంది. ఈ ఘటన పై మీడియా పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా.. వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Manoj : సైదాబాద్ రాక్షసుడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం.. దేవుడు ఉన్నారంటూ..

Minister KTR: హంతకుడు చనిపోయాడు… సైదాబాద్‌ రాక్షసుడి ఆత్మహత్యపై ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..

సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం