Minister KTR: హంతకుడు చనిపోయాడు… సైదాబాద్‌ రాక్షసుడి ఆత్మహత్యపై ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..

సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజు ఆత్మహత్యకు సంబంధించిన సమాచారాన్ని తనకు..

Minister KTR: హంతకుడు చనిపోయాడు... సైదాబాద్‌ రాక్షసుడి ఆత్మహత్యపై ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..
Ktr
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2021 | 1:23 PM

సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజు ఆత్మహత్యకు సంబంధించిన సమాచారాన్ని తనకు డీజీపీ తెలిపినట్లుగా మంత్రి వివరించారు. హంతకుడి మృతదేహంను రైల్వేట్రాక్‌పై గుర్తించినట్లుగా తనకు ట్వీట్ చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్న‌ట్లు లోకో పైల‌ట్ పోలీసుల‌కు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే ప‌చ్చ‌బొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు తెలంగాణ డీజీపీ ట్వీట్‌ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్‌ 9) చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం

Saidabad Incident: మేమున్నాం మీకు.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ..