Bullettu Bandi Song: గుంటూరులో ‘బుల్లెట్‌ బండి’ సందడి.. పారిశుద్ధ్య కార్మికుల డ్యాన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

Bullettu Bandi Song: ఏ క్షణానా బుల్లెట్‌ బండి పాట విడుదలైందో కానీ శ్రోతలను విపరీతంగా ఆకట్టకుంటోంది. సోషల్‌ మీడియా, రెగ్యులర్‌ మీడియా ఇలా అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఈ పాట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా...

Bullettu Bandi Song: గుంటూరులో 'బుల్లెట్‌ బండి' సందడి.. పారిశుద్ధ్య కార్మికుల డ్యాన్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 4:13 PM

Bullettu Bandi Song: ఏ క్షణానా బుల్లెట్‌ బండి పాట విడుదలైందో కానీ శ్రోతలను విపరీతంగా ఆకట్టకుంటోంది. సోషల్‌ మీడియా, రెగ్యులర్‌ మీడియా ఇలా అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఈ పాట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా సిరిసిల్లా జిల్లాకు చెందిన శ్రియ అనే నవ వదువు వివాహం తర్వాత నిర్వహించిన బరాత్‌లో ఈ పాటకు స్టెప్పులు వేసింది. దీంతో ఈ పాట మరింత వైరల్‌గా మారింది. ఇక అప్పటి నుంచి వివాహం నుంచి పుట్టిన రోజు వేడుక వరకు ఏ చిన్న పార్టీ జరిగినా ఈ పాటకు డ్యాన్స్‌ చేయాల్సిందే. ఏకంగా ఈ పాట ఖండాంతరాలు దాటేసింది. కేవలం వినోదాన్ని కాకుండా రోగులకు చికిత్సగా కూడా ఈ పాట ఉపయోగపడిన ఉదాహరణలు చూశాం.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లెట్‌ బండి పాట మరోసారి వైరల్‌గా మారింది. ఈసారి పారిశుద్ధ్య కార్మికుల రూపంలో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. పారిశుద్ధ్య కార్మికులు ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం చెమటను చిందిస్తూ సమాజాన్ని శుభ్రంగా ఉంచుతారు. అయితే విధి నిర్వహణలో భాగంగా వీరు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను పోగొడుతూ వారిలో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేశారు గుంటూరుకు చెందిన అధికారులు.

ఇందుకోసం వారు బుల్లెట్‌ బండి పాటనే ఎంచుకున్నారు. పని నుంచి రిలీఫ్‌ పొందేందుకు గాను కార్మికులందరినీ లైన్‌లో నిల్చుండబెట్టి వారితో డ్యాన్స్‌ చేయించారు. దీంతో కార్మికులు కూడా వయసును మరిచిపోయి ఎంచక్కా ‘ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు’ అంటూ స్టెప్పులేశారు. మరి నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: SBI Home Loan: సొంత ఇల్లు కోసం చూసే వారికి ఎస్బీఐ శుభవార్త.. గృహరుణాలపై వడ్డీ తగ్గింపు.. ఎంతవరకూ అంటే..

Anand Mahindra: మహీంద్ర వాహనాల స్పీడ్‌ ముందు వరదలు కూడా బలాదూర్‌.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌.

AP Cabinet: ఏపీ కేబినేట్ నిర్ణయాలు.. విద్యార్ధులకు గుడ్ న్యూస్.. వివరాలివే.!