Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం సాహసం రా బాబు.. ప్రాణాలతో చెలగాటమే.. వీడియో చూస్తున్నంతసేపు ఊపిరి బిగపట్టాల్సిందే..

జీవితం అన్నాక సాహసాలు చేయాలి.. లేదంటే అర్థమే లేదు అంటుంటారు కొందరు. అలాగే ప్రాణాలతోనూ చెలగాటమాడకూడదు.

Viral Video: ఇదేం సాహసం రా బాబు.. ప్రాణాలతో చెలగాటమే.. వీడియో చూస్తున్నంతసేపు ఊపిరి బిగపట్టాల్సిందే..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 5:40 PM

జీవితం అన్నాక సాహసాలు చేయాలి.. లేదంటే అర్థమే లేదు అంటుంటారు కొందరు. అలాగే ప్రాణాలతోనూ చెలగాటమాడకూడదు. కానీ కొందరు మాత్రం సాహసాలకు కెరాఫ్ అడ్రస్‏గా నిలుస్తుంటారు. ప్రాణాలంటే లేక్కచేయకుండా.. రిస్క్ చేసేస్తుంటారు. అయితే కొందరు చేసే సాహసాలు.. వినూత్న ప్రయోగాలు చూస్తుంటే.. మన వెన్నులో వణుకు పుడుతుంది. ఇక్కడ కొందరు యువకులకు అసలు భయం అంటే ఎంటో తెలియనట్లుగా కనిపిస్తోంది. స్పీడ్‏గా వెళ్తున్న రైలుతో వారు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యంతోపాటు.. ఒకింత భయం కలగకమానదు. ప్రాణమంటే లెక్కలేకుండా.. ఆ యువకులు చేస్తున్న ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తున్నంత సేపు మీరు ఉపిరి బిగపట్టాల్సిందే.

ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న వీడియో తెగ వైరల్ అవుతుంది. అలాగే లైక్స్ కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నారు చాలా మంది. డిఫరెంట్‏గా ట్రై చేస్తే ఎక్కువ లైక్స్, షేర్స్ అందుకొవచ్చని తెగ ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు సరదాకు చేసిన పనులు ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇక వివిధ రకాల విన్యాసాలు చేయడం వలన ప్రాణాలు పొగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా కదులుతున్న రైలు నుంచి చేసే విన్యాసాలు ఎంతంగా ప్రమాదకరమైనవో తెలిసిన సంగతే. కానీ ఇక్కడ వీడియోలో మాత్రం కొందరు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయానిస్తూ.. ఒక చేత్తో రైలు పట్టుకుని ప్రాణాంతకమైన విన్యాసాలు చేశారు. స్పీడ్‏గా వెళ్తున్న రైలు నుంచి వారు చేస్తున్న వీడియోలు చూస్తే ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా వేస్తుంది. ఒక చేత్తో రైలుకు ఉన్న హ్యాండిల్ పట్టుకుని.. పూర్తిగా శరీరాన్ని గాల్లోకి వదిలేసాడు. అంతేకాదు.. రన్నింగ్.. ఊయాల ఉగుతున్నట్లుగా గాల్లో తేలుతూ అత్యంత ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో గతంలోనిదే..  మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి మీరు కూడా ఓసారి వీడియోను చూసేయ్యండి..

ట్వీట్..

Also Read: Madonna Sebastian: ప్రేమమ్ బ్యూటీ మడోన్న సెబాస్టియన్ లేటెస్ట్ పిక్స్..

Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..