Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 16, 2021 | 4:50 PM

Allu Arjun & Sai Dharam Tej: వినాయక చవితి రోజున శుక్రవారం (స్టెప్టెంబర్ 10న) మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు

Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..
Allu Arjun

Follow us on

Allu Arjun & Sai Dharam Tej: వినాయక చవితి రోజున శుక్రవారం (స్టెప్టెంబర్ 10న) మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్ పై నుంచి ఐకియా వైపుగా గచ్చిబౌలి వెళుతోన్న సమయంలో తేజ్‌ ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను జూబ్లీ హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. షోల్డర్‌ బోన్‌ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదం గురించిన తెలుసుకున్న సినీ ప్రముఖులు అపోలోకు చేరుకుని హీరోను పరామర్శించారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

ఈరోజు (గురువారం ) మధ్యాహ్నం.. అల్లు అర్జున్.. అపోలో ఆసుపత్రికి వెళ్లి తేజ్‏ను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ ప్రమాదం గురించి ముందుగా తెలిసిందే బన్నీకే అంటా.. కానీ.. పుష్ప షూటింగ్ కారణంగా కాకినాడ వెళ్లిన బన్నీ.. సాయి ధరమ్‏ను పరామర్శించడానికి రాలేకపోయారు. షూటింగ్ అనంతరం హైదరాబాద్ వచ్చిన బన్నీ.. వెంటనే తేజ్‏ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లారు.

Also Read: Akkineni Nagarjuna: ది బేకర్ అండ్ ది బ్యూటీ యూనిట్‏కు నాగార్జున విషెస్.. ఆహాలో ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్..

NTR: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. యంగ్ టైగర్‏కు జోడిగా ఆ ముద్దుగుమ్మ..

Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu