NTR: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. యంగ్ టైగర్‏కు జోడిగా ఆ ముద్దుగుమ్మ..

అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తారక్... రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్

NTR: ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. యంగ్ టైగర్‏కు జోడిగా ఆ ముద్దుగుమ్మ..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 16, 2021 | 3:44 PM

అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తారక్… రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే అక్టోబర్‏లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా గతంలోనే మేకర్స్ ప్రకటించగా..అనూహ్యంగా సినిమా విడుదలను వాయిదా వేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్‏మెంట్ కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‏గా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‏కు జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో అలియా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Alia

Alia

ఇదిలా ఉంటే.. కొరటాల శివ తెరకెక్కించే సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటించనున్నాడని.. ఇందులో పలువురు టాలీవుడ్ హీరోలు సైతం కీలకపాత్రలలో కనిపించనున్నట్లగా టాక్. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు కొరటాల. అలాగే చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్

Prabhas: మరోసారి జక్కన్న దర్శకత్వంలో బాహుబలి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బడా నిర్మాణ సంస్థ కసరత్తులు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే