యూపీ, తెలంగాణను షేక్‌చేస్తున్న బుల్డొజర్‌.. అసలు పేరు ఇదేనట..! దీని వెనుక రహస్యం తెలిస్తే..

ప్రస్తుతం తెలంగాణలో ఈ బుల్డోజర్ ఫీవర్‌ కొనసాగుతోంది. బుల్డోజర్‌ చర్యకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీని తదుపరి విచారణ సెప్టెంబర్ 17, 2024న జరగనుంది. అయితే, ఈ బుల్డోజర్ వాహనం అసలు పేరు ఇది కాదని మీకు తెలుసా? ఇతర వాహనాలతో పోలిస్తే దీని మైలేజీని కూడా భిన్నంగా కొలుస్తారు.

యూపీ, తెలంగాణను షేక్‌చేస్తున్న బుల్డొజర్‌.. అసలు పేరు ఇదేనట..! దీని వెనుక రహస్యం తెలిస్తే..
Bulldozer
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:29 PM

బుల్డోజర్ పేరు మీరు చాలాసార్లు విని ఉంటారు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడల్లా బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. బుల్డోజర్ ఒక శక్తివంతమైన యంత్రం. ఇది అందరికీ తెలుసు. బుల్డోజర్ 90ల పిల్లలకు కూడా ఇష్టమైన వాహనం. ఇది తవ్వకాలకు, చెత్తను తొలగించడానికి, ఆక్రమణలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో బుల్డోజర్ అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే దీని అసలు పేరు మీకు తెలుసా? బుల్డోజర్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం తెలంగాణలో ఈ బుల్డోజర్ ఫీవర్‌ కొనసాగుతోంది. బుల్డోజర్‌ చర్యకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీని తదుపరి విచారణ సెప్టెంబర్ 17, 2024న జరగనుంది. అయితే, ఈ బుల్డోజర్ వాహనం అసలు పేరు ఇది కాదని మీకు తెలుసా? ఇతర వాహనాలతో పోలిస్తే దీని మైలేజీని కూడా భిన్నంగా కొలుస్తారు.

భారతదేశంలో అత్యధికంగా బుల్డోజర్లను విక్రయించే కంపెనీ JCB. కానీ చాలామంది బుల్‌డోజర్ అంటే JCB అని అర్థం చేసుకుంటారు. పసుపు రంగు బుల్డోజర్‌పై నలుపు రంగులో JCB బ్రాండ్ పేరు రాయడం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.. ఇది కాకుండా ఇతర కంపెనీలు కూడా బుల్డోజర్లను విక్రయిస్తాయి. మార్కెట్లో అనేక రకాల బుల్డోజర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి కెపాసిటీ, మైలేజీ, ధర మొదలైన వాటిలో తేడా ఉంటుంది. బుల్డోజర్ అసలు పేరు బ్యాక్‌హో లోడర్. బుల్డోజర్ లేదా బ్యాక్‌హో లోడర్ కోసం ‘మైలేజ్’ అనే పదాన్ని కొద్దిగా భిన్నంగా ఉపయోగిస్తారు. దేశంలో వివిధ రకాల బుల్డోజర్ యంత్రాలు పనిచేస్తాయి. Backhoe Loade మెషీన్‌లు వివిధ మోడల్‌లలో వస్తాయి.

ఇవి కూడా చదవండి

కార్లు లేదా బైక్‌ల మాదిరిగా కాకుండా వాటి మైలేజీని లీటర్‌కి కిలోమీటర్లలో లెక్కించరు. బదులుగా, బుల్డోజర్ ఒక గంటలో ఉపయోగించే డీజిల్ మొత్తాన్ని కొలుస్తారు. బుల్‌డోజర్‌కి మైలేజ్ ఎంత అనేది అది గంటసేపు నడిచినప్పుడు ఉపయోగించే డీజిల్ మొత్తాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఒక సాధారణ బుల్డోజర్ ఒక గంట పాటు నడపడానికి సుమారు 4-5 లీటర్ల డీజిల్ అవసరం. ఒక గంటలో బ్యాక్‌హో లోడర్ ఎంత డీజిల్‌ను ఉపయోగిస్తుంది.. అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే, జేసీబీ 1979లో జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైంది. భారతదేశంలో 40 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉంది. JCB, బుల్డోజర్ తయారీ కంపెనీ, బ్రిటన్‌లో స్థాపించబడింది

ఈ బుల్డొజర్‌ వేర్వేరు నమూనాలు వేర్వేరు ఇంజిన్లను కలిగి ఉంటాయి. కాబట్టి, వాటి ఇంధన వినియోగం మారుతూ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్‌హో లోడర్ ఎక్కువ పని చేయాల్సి వస్తే, అది ఎక్కువ డీజిల్‌ను వినియోగిస్తుంది. నేల గట్టిగా ఉంటే, బ్యాక్‌హో లోడర్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీంతో డీజిల్ వినియోగం పెరుగుతుంది. విశేషమేమిటంటే, ఎక్కువ శక్తివంతమైన భారీగా పనిచేసే యంత్రం తక్కువ డీజిల్ వినియోగిస్తుంది. JCB బుల్డోజర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 35 లక్షల నుండి ప్రారంభమవుతుంది. RTO మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొదలైన తర్వాత దీని ధర మరింత పెరుగుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..