చెవులు లేని పాములు ఎలా వింటాయో తెలుసా..?ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే బిత్తర పోవాల్సిందే..!

ఇకపోతే, మనుషుల మాదిరిగానే పాములకు కూడా ముక్కు రంధ్రాలు ఉంటాయి. కానీ వాటిని వాసన కోసం ఉపయోగించవు. పాములకు ఎందుకు అంత భయం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి అసలు కారణం వాటికి కనురెప్పలు లేకపోవడమే. అవును, పాములకు కనురెప్పలు ఉండవు. దీనివల్ల ఎప్పుడూ..

చెవులు లేని పాములు ఎలా వింటాయో తెలుసా..?ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే బిత్తర పోవాల్సిందే..!
Snakes
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:06 PM

దాదాపుగా అందరూ పాములను చూసే ఉంటారు. లైవ్‌లో పాములను చూడని వారు కనీసం ఫోన్‌లోనో లేదంటే సినిమాల్లోనో చూసి ఉంటారు. ఇక కొంతమందికి పాములంటే చాలా భయం. పాము కాటువేసిందంటే.. నిమిషాల్లోనే ఆ వ్యక్తి ప్రాణం పోతుంది..పాము కాటు చాలా ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పాము కాటుతో చాలా మంది మరణిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, పాములకు చెవులు ఉండవని, కనురెప్పలు కూడా ఉండవని చెబుతున్నారు. పాములకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

మనం పాము దారిలోకి వస్తేనే అవి మనపై దాడి చేస్తాయి. పాములు చిన్న కదలికలను కూడా చాలా స్పష్టంగా వినగలవు. అందుకే చాలా వేగంగా వినేవారిని పాము చెవులు అంటారు. నిజానికి పాములకు చెవులు ఉండవంటున్నారు పరిశోధకులు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, అవి శబ్ధాలను ఎలా వింటాయి అన్నది ఇక్కడ సందేహం.! కానీ, నిజానికి పాములకు బయటి చెవులు ఉండవు. కానీ వాటికి లోపలి చెవులు ఉంటాయి. అందుకే పాములు ప్రతి చిన్న శబ్దాన్ని కూడా వినగలవు. పాముల లోపలి చెవులు ధ్వని కంపనాలను గుర్తించగలవు. మానవులు 20 నుండి 20 వేల హెర్ట్జ్ శబ్దాలను వినగలరు. అయితే పాములు 200 నుండి 300 హెర్ట్జ్ శబ్దాలను వినగలవని మీకు తెలుసా?

పాములు దవడ ఎముకల ద్వారా భూమి ప్రకంపనలను గుర్తిస్తాయట. పాముల దవడ ఎముక ఈ ప్రకంపనలను లోపలి చెవికి ప్రసారం చేస్తుంది. ఇది ధ్వనిని గుర్తించడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? పాములకు అసలే వినడబడదు. కానీ ఇవి వాటి నాలుకతోనే కమ్యూనికేట్ చేస్తాయి. పాముల్లో ఉండే ఈ గుణం వల్ల తమపై ఎవరు దాడి చేస్తున్నారో సులువుగా తెలుసుకోగలుగుతాయి.

అలాగే, సరీసృపాలు క్షీరదాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి పిల్లలకు జన్మనిచ్చే బదులు పాములు గుడ్లు పెడతాయి. ఇది అందరికీ తెలుసు. కానీ, 70శాతం పాములు మాత్రమే గుడ్లు పెడతాయి. ఇతర పాములు గుడ్లు పెట్టవు. ముఖ్యంగా చల్లని వాతావరణంలో నివసించే పాములు గుడ్లు పెట్టే బదులు పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే చల్లని వాతావరణంలో గుడ్లు జీవించలేవు.

పాములకు ఎందుకు అంత భయం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి అసలు కారణం వాటికి కనురెప్పలు లేకపోవడమే. అవును, పాములకు కనురెప్పలు ఉండవు. దీనివల్ల ఎప్పుడూ కళ్లు తెరిచే ఉంటాయి.. నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కళ్లు తెరిచి ఉంటాయి. అయితే, కనురెప్పలు లేకపోవడం వల్ల వాటి కళ్లను రక్షించడానికి, పాము కంటిపై ఒక సన్నని పొర ఉంటుంది. ఈ పొరను ‘బ్రిల్’ అంటారు. జర్మన్ భాషలో అద్దాలు అని అర్థం.

ఇకపోతే, మనుషుల మాదిరిగానే పాములకు కూడా ముక్కు రంధ్రాలు ఉంటాయి. కానీ వాటిని వాసన కోసం ఉపయోగించవు. పాములు తమ నాలుకతో మాత్రమే వాసన చూస్తాయి. పాములు అద్భుతమైన వాసన గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే దీనిని “స్టీరియోలో స్నిఫింగ్” అని కూడా అంటారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..