ఇదేంట్రా సామీ..! ఫిర్యాదు కాగితాల దండతో కలెక్టర్ కార్యాలయంలో పొర్లు దండాలు..!

అవినీతికి పాల్పడ్డ గ్రామ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒంటిపై చొక్కా తీసేసి, తన మెడలో కాగితాల దండను ధరించి, పొర్లుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగింది ఈ ఘటన.

ఇదేంట్రా సామీ..! ఫిర్యాదు కాగితాల దండతో కలెక్టర్ కార్యాలయంలో పొర్లు దండాలు..!
Mp Man Rolls
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 04, 2024 | 2:05 PM

అవినీతికి పాల్పడ్డ గ్రామ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒంటిపై చొక్కా తీసేసి, తన మెడలో కాగితాల దండను ధరించి, పొర్లుకుంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగింది ఈ ఘటన.

ముఖేష్ ప్రజాపత్ అనే వ్యక్తి గత 6 సంవత్సరాలుగా చేస్తున్న తన ఫిర్యాదులను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఈ విధంగా నిరసనకు దిగాడు. కాగితాలతో చేసిన దండతో మెడలో ధరించి జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని రోడ్డుపై డోర్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పేపర్లు తన స్వగ్రామమైన కంకరియా సర్పంచ్‌పై అవినీతి ఫిర్యాదులని ఆయన పేర్కొన్నారు.

నీముచ్ జిల్లా కలెక్టర్ హిమాన్షు చంద్ర ఆ వ్యక్తి ఫిర్యాదుపై స్పందించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపతి గతంలో తమ సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. అతని ఆరోపణలపై పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే విచారణ జరిపిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మమతా ఖేడే తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మరోసారి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ప్రతి మంగళవారం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ స్వీకరిస్తారు. ఇక్కడ సీనియర్ అధికారులు పౌరులు సమర్పించిన ఫిర్యాదులను స్వీకరించి సమీక్షిస్తారు. అంతకుముందు జూలై నెలలో, ఒక వృద్ధ రైతు భూసేకరణపై తన ఫిర్యాదును అధికారులు పరిష్కరించలేదని ఆరోపిస్తూ మందసౌర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నేలపై తలకిందులుగా దీక్ష చేసి నిరసన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..