Watch: మమ్మల్ని ఎవడ్రా ఆపేది..! గవర్నమెంట్‌ కారుతో గాల్లో చక్కర్లు కొడుతున్న యువత.. ఆ స్టంట్స్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తే.. ఇక సాధారణ ప్రజలను ఎలా ఆపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ వీడియోపై స్పందిస్తూ.. సామాన్యులకు మాత్రమే చట్టం అని రాశారు. ఈ వాహనానికి కూడా చలాన్ వేస్తారా..? ప్రశ్నిస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.

Watch: మమ్మల్ని ఎవడ్రా ఆపేది..! గవర్నమెంట్‌ కారుతో గాల్లో చక్కర్లు కొడుతున్న యువత.. ఆ స్టంట్స్‌ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Ghaziabad Stunt
Follow us

|

Updated on: Sep 04, 2024 | 12:06 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో యువకులు చేసే స్టంట్‌కు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు సంబంధించిన ఒక షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో వెలువడింది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ వాహనంలో స్టంట్స్‌ చేస్తూ కనిపించారు. అందులో ఒకరు కారులో వేలాడుతూ ఉండగా, మరొకరు కారు డ్రైవ్‌ చేస్తున్నారు. మరో వ్యక్తి ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ స్టంట్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ఘజియాబాద్‌లోని విజయ్ నగర్‌కు చెందినదిగా తెలిసింది.

వైరల్‌ వీడియో చూసిన నెటిజన్లు, స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. బాధ్యత గల ప్రభుత్వ అధికారిక పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తారా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపించిన కారులో ఎవరైనా అధికారి ఉన్నారా..? లేదా ఇతరులేవరైనా ఈ కారును తీసుకువెళ్లారా అనేది తెలియరాలేదు. కానీ, కారుతో కొందరు యువకులు స్టంట్‌ చేస్తున్న దృశ్యాలు మాత్రం వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. కార్ విండ్ షీల్డ్‌పై మేజిస్ట్రేట్ అని కూడా రాసి ఉంది. అంతేకాదు కారుపై ఎరుపు, నీలం రంగు లైట్లు కూడా అమర్చబడి ఉన్నాయి. హైవేపై నడుస్తున్న ఈ వాహనం విండోకు ఓ వ్యక్తి వేలాడుతున్న తీరు నిజంగా ప్రమాదకరంగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్‌నెట్‌లో వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తే.. ఇక సాధారణ ప్రజలను ఎలా ఆపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ వీడియోపై స్పందిస్తూ.. సామాన్యులకు మాత్రమే చట్టం అని రాశారు. ఈ వాహనానికి కూడా చలాన్ వేస్తారా..? ప్రశ్నిస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు.

ఈ వీడియో చూడండి..

మేజిస్ట్రేట్ కారులో విన్యాసాలు చేస్తున్నారని, చట్టాన్ని హాస్యాస్పదంగా మార్చారని మరొకరు రాశారు. బహుశా తరువాతి పర్యవసానాల గురించి వారికి భయం లేదని, లేకపోతే అలాంటి చర్యకు పాల్పడే ముందు వందసార్లు ఆలోచించి ఉండేవారని అంటున్నారు. మరొక దీనిపై వ్యాఖ్యనిస్తూ..ఇలాంటి స్టంట్స్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని ఆరోపించారు. కాగా, వీడియో వైరల్‌ కావడంతో ఘజియాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వీరికి చలాన్‌ విధించినట్టుగా తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..