Watch: అయ్యో ఎంతకష్టమొచ్చింది.. విజయవాడలో బాహుబలి సీన్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
మూడ్రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొందరు కాలినడకన బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక.. ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండెను పిండేస్తున్న దృశ్యం కంటపడింది.
తెలుగు రాష్ట్రాలలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. భారీగా వరదలు సంభవించడంతో రాత్రికి రాత్రే అనేక కాలనీల్లో కూడా భారీగా నీరు వచ్చి చేరింది. అనేక అపార్ట్ మెంట్ లు రాత్రికి రాత్రే నీటిలో మునిగిపోయాయి. మూడంతస్థుల భవనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పై అంతస్తుల్లోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విజయవాడ వరదల్లో కనిపిస్తున్న దృశ్యాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు.. వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్నికావు.
డ్రమ్ములు, లారీ ట్యూబ్‌లు.. ప్లాస్టిక్ బాక్స్‌లు ఇలా ఏది దొరికితే అది.. ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలే చేస్తున్నారు. చిన్నారులు, గర్భిణు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. మూడ్రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొందరు కాలినడకన బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక.. ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండెను పిండేస్తున్న దృశ్యం కంటపడింది.
ఈ వీడియో చూడండి..
సింగ్‌నగర్‌లో ఒక చిన్నారిని తొట్టెలో పడుకొబెట్టి ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి మరీ వరద నీళ్లలోంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరికొందరు గుండెను పిండేస్తుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..