AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఎయిర్‌పోర్టులో ఆకలిని తట్టుకోలేక.. సూట్‌కేస్ తింటున్న యువతి..! షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఎయిర్ పోర్ట్‌లో కూర్చుని ఉన్న ఆ యువతి ఉన్నట్టుండి సూట్ కేస్ కొరుక్కుంటూ తినటం ప్రారంభించింది. తొలుత అక్కడున్న వారికి మహిళ ప్రవర్తన వింతగా అనిపించింది. అంతే కాకుండా.. ఆ యువతి..కొరుక్కుతుంటున్న అదే సూట్‌కేస్‌తో అటు ఇటు వెళ్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో అందరూ ఆమె వైపుకే చూస్తున్నారు. అయితే, ఇక్కడో ట్విస్ట్‌ ఉంది.. అందేటో చాలా సేపటి తర్వాత... అక్కడున్న వారికి తెలిసింది. అదేంటంటే..

Watch: ఎయిర్‌పోర్టులో ఆకలిని తట్టుకోలేక.. సూట్‌కేస్ తింటున్న యువతి..! షాకింగ్‌ వీడియో వైరల్‌..
Suitcase Modle Cake
Jyothi Gadda
|

Updated on: Sep 04, 2024 | 9:13 AM

Share

కొంతమంది ఫేమ్‌ కోసం వింత వింత పనులు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో యువత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి రీళ్ల మోజులో పడి కొందరు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. లైక్స్, కామెంట్స్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా వారు వెనుకాడటం లేదు. కొంతమంది బైక్‌లు, బస్సులు, విమానాల్లో ప్రాణభయం లేకుండా రోడ్లపై రీళ్లు కూడా చేస్తుంటారు. ఇలాంటిదే ఎయిర్‌పోర్ట్‌లో ఓ యువతి చేసిన విచిత్రమైన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్‌ వీడియోలో ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ హాల్‌లో ఓ యువతి కూర్చుని ఉంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది.. ఈసారి ఆమె చేసిన పనిని చూసి చుట్టుపక్కల ప్రయాణికులు షాక్ అయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్ట్‌లో కూర్చుని ఉన్న ఆ యువతి ఉన్నట్టుండి సూట్ కేస్ కొరుక్కుంటూ తినటం ప్రారంభించింది. తొలుత అక్కడున్న వారికి మహిళ ప్రవర్తన వింతగా అనిపించింది. అంతే కాకుండా.. ఆ యువతి..కొరుక్కుతుంటున్న అదే సూట్‌కేస్‌తో అటు ఇటు వెళ్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో అందరూ ఆమె వైపుకే చూస్తున్నారు. అయితే, ఇక్కడో ట్విస్ట్‌ ఉంది.. అందేటో చాలా సేపటి తర్వాత… అక్కడున్న వారికి తెలిసింది.

ఈ వీడియో చూడండి..

అదేంటంటే.. అది కేకుతో చేసిన సూట్ కేస్ అని. సూట్‌కేస్‌ తింటున్న యువతిని చూసి అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ, చివరకు అది కేక్‌ అని తెలిసి నోరెళ్ల బెట్టారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us