కిటికీ, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి..! ఏం చేస్తాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

వంటగది కిటికీని పగులగొట్టి ఇంట్లోకి చొరబడుతున్నాడు. వంటగదిలోకి వెళ్లి, తన కోసం వంట చేసుకుంటాడు. ఆ తరువాత పాత్రలు శుభ్రం చేసిపెడతాడు. అక్కడే స్నానం కూడా చేస్తాడు. అంతేకాదు చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలు, ఇంట్లో అన్ని వస్తువులను చక్కగా సర్ధి పెడుతున్నాడు. మంచంపై వేసి ఉన్న దుప్పట్లు కూడా మడతపెట్టి సర్దుతున్నాడు. యజమానికి ఓ నోట్ రాసి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు..

కిటికీ, తలుపులు పగలగొట్టి ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి..! ఏం చేస్తాడో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Thief
Follow us

|

Updated on: Sep 03, 2024 | 2:05 PM

కిటికీ, తలుపులు పగులగొట్టి, ఇళ్లంతా చిందరవందరంగా వస్తువులు పడి ఉంటే ఇంట్లోకి ఎవరో చొరబడి ఉంటారని, దొంగతనం జరిగిందని మొదట అనుమానం వస్తుంది. కానీ, కిటికీ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ముందుగా ఆ ఇంటిని శుభ్రం చేశాడు. కిచెన్‌లోకి వెళ్లి వంట కూడా చేశాడు..తరువాత ఆ ఇంట్లోనే స్నానం చేసి యజమానికి ఓ లెటర్‌ కూడా రాసిపెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. చివరకు ఇంటికి చేరుకున్న ఆ యజమాని ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.. తను వచ్చింది తన ఇంటికి కాదేమోననే సందేహంలో కూడా పడ్డాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరూ లేని సమయంలో కిటికీ పగులగొట్టి లోపలికి దూరాడు. అతను వచ్చింది దేని కోసమే తెలియదు గానీ, ఆ ఇళ్లంతా శుభ్రం చేసి, వంట చేసి, స్నానం చేసి, ఓనర్‌కు ఒక మెసేజ్‌ పాస్‌ చేసి పారిపోయాడు.. ఇలా వాషింగ్టన్‌లోని అనేక ఇళ్లలో ఇదే జరిగింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇళ్లలోకి ప్రవేశించి తానే స్వయంగా ఆహారాన్ని వండి, ఆపై ఇళ్లంతా శుభ్రం చేసి పారిపోతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏ ఇంట్లోనూ దొంగతనం జరగలేదు.

సమాచారం మేరకు.. వంటగది కిటికీని పగులగొట్టి ఇంట్లోకి చొరబడుతున్నాడు. వంటగదిలోకి వెళ్లి, తన కోసం వంట చేసుకుంటాడు. ఆ తరువాత పాత్రలు శుభ్రం చేసిపెడతాడు. అక్కడే స్నానం కూడా చేస్తాడు. అంతేకాదు చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలు, ఇంట్లో అన్ని వస్తువులను చక్కగా సర్ధి పెడుతున్నాడు. మంచంపై వేసి ఉన్న దుప్పట్లు కూడా మడతపెట్టి సర్దుతున్నాడు. అంతేగానీ, ఎలాంటి దొంగతనం చేయలేదని స్థానికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు..ఇంట్లోంచి వెళ్లిపోయే ముందు ఆ ఇంటి వారికి ఓ నోట్‌ కూడా రాసిపెడుతున్నాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆ నోట్‌లో ‘నాకు ఆహారం లేక చాలా ఇబ్బంది పడ్డాను. నేను మీ ఇంట్లోకి ప్రవేశించాను. నేను ఇంట్లో భోజనం చేసాను, స్నానం చేసాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ తను చేసిన పనికి క్షమాపణలు కూడా కోరుతున్నాడని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..