ఓరీ దేవుడో.. నాలుగేళ్లలో ఐదుసార్లు గర్భం దాల్చి సంచలనం సృష్టించిన మహిళ..! అసలు విషయం తెలిస్తే..

కాసుల కక్కుర్తితో ఇప్పుడు ఈ మహిళ చేసిన పని సర్వత్ర విమర్శలకు గురి చేసింది. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఓరీ దేవుడో.. నాలుగేళ్లలో ఐదుసార్లు గర్భం దాల్చి సంచలనం సృష్టించిన మహిళ..! అసలు విషయం తెలిస్తే..
Pregnant
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2024 | 1:34 PM

బీమా సొమ్ముల కోసం కొందరు కేటుగాళ్లు కన్నింగ్‌ ప్లాన్స్‌ వేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా అనేకం వినే ఉంటారు. పాలసీ పైసల కోసం బతికి ఉన్న మనుషుల్ని కూడా చనిపోయినట్టుగా అధికారుల్ని బురిడీ కొట్టించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ మహిళ ఐదుసార్లు గర్భవతినని సదరు పాలసీ సంస్థను దోచుకుంది. ప్రతిసారీ డబ్బులు చెల్లించిన సదరు సంస్థ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు గుట్టురట్టైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

చైనాలో గర్భిణీ స్త్రీలకు బీమా సౌకర్యాలు ఉన్నాయి. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ మహిళ బీమా కంపెనీలను మోసం చేయడం ప్రారంభించింది. చైనాలోని షాంఘైకి చెందిన ఓ మహిళ నాలుగైదు సార్లు అబార్షన్ చేయించుకున్నట్లు నటించి నకిలీ వైద్య పత్రాలు తయారు చేసి 66,200 యువాన్ల (US$9,300, రూ. 10 లక్షలకు పైగా) బీమా పొందింది. 42 ఏళ్ల ఆ మహిళ బాగా చదువుకుంది. ఈ మహిళ విశ్వవిద్యాలయం నుండి టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ చదివింది. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. ఆమె షాంఘైలోని ఒక విదేశీ కంపెనీలో పని చేస్తుందని సమాచారం. 30,000 యువాన్ల (4,200 US డాలర్లు, సుమారు మూడు లక్షల రూపాయలు) కంటే ఎక్కువ జీతం పొందుతుంది. కానీ, కాసుల కక్కుర్తితో ఇప్పుడు ఈ మహిళ చేసిన పని సర్వత్ర విమర్శలకు గురి చేసింది. ఈ వార్త సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

సదరు లేడి గతేడాది డిసెంబర్‌లో ప్రసూతి సెలవులు తీసుకుంది. తన మొదటి అబార్షన్ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బు ఎలా సంపాదించిందో అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. దాంతో ఈజీగా డబ్బు సంపాదించాలని పథకం వేసింది. మహిళ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో తానే స్వయంగా తప్పుడు పత్రాలను తయారు చేసుకుంది. అందులో ఆసుపత్రిలో చేరడం నుండి అబార్షన్ వరకు సమాచారం ఉంది. ఇదంతా ఫేక్ అయినప్పటికీ, పాలసీ కంపెనీ నమ్మేసింది. ఆమెకు ఇలా నాలుగైదు సార్లు చేసి డబ్బులు చెల్లించింది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో బిడ్డకు జన్మనిచ్చి, ఆపై బీమా కోసం దరఖాస్తు చేసుకుంది. దాంతో ఆమె డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు మాయ లేడి భాగోతం బట్టబయలు చేశారు.

ఇవి కూడా చదవండి

విషయం అర్థం చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పటికే, నాలుగేళ్లలో ఐదుసార్లు ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసి సొమ్ము చేసుకున్నట్టుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో చేసేది లేక తానుగా పోలీసుల ఎదుట లొంగిపోయింది. తను తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!