Watch: రాళ్ళవాగు ఉధృతికి కొట్టుకుపోయిన డీసీఎం ఐదుగురు గల్లంతు..! అక్కడే చేపల కోసం ఎగబడ్డ జనం.. మరీ ఇంత కక్కుర్తా
అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు స్థానికులు. కుప్పలు తెప్పలుగా కొట్టుకువచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రమాదాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో
గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లా కేంద్రం శివారు ప్రాంతం ఈదుల పూసపల్లి సమీపంలోని రాళ్ళ వాగు వరద ఉధృతికి కల్వర్టుపైనుంచి వెళ్లిన DCM వ్యాన్ కొట్టుకు పోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోగా పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది అతికష్టం మీద నలుగురిని కాపాడారు. ఒకరు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. రంగారెడ్డి జిల్లా కొంపెల్లి నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకొని 5 గంటల పాటు నరకయాతన అనుభవించిన నలుగురిని కాపాడారు.
ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నట్టుగా మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్ ను పట్టుకొని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.
ఈ వీడియో చూడిండి..
ఇదిలా ఉంటే, అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు స్థానికులు. కుప్పలు తెప్పలుగా కొట్టుకువచ్చిన చేపల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రమాదాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ప్రమాదం జరిగిన రోజున డీసీఎంను ముందుకు వెళ్లొద్దని చెప్పినా కూడా వినకుండా వాగులోకి వెళ్లారని, ప్రవాహంలో డీసీఎం మునిగిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో నలుగురిని రక్షించాం. మరొకరి కోసం గాలిస్తున్నట్టుగా మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి వివరాలు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..