Watch: విద్యార్థుల ఇళ్లలో 1,000 మంది పోలీసులతో సోదాలు.. పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం.. ఎక్కడంటే..
ఐదు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, ఇతర నిషేధిత నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 500 మంది మహిళా సిబ్బందితో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీసు బృందం ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది కళాశాల విద్యార్థులతో సహా 10 మందిని అరెస్టు చేశారు.
చెన్నైలో విద్యార్థుల ఇళ్లలో 1,000 మంది పోలీసుల సోదాలు నిర్వహించారు. చెన్నైలోని పోథేరి ప్రాంతంలో 500కు పైగా విద్యార్థుల నివాసాలలో తాంబరం పోలీసులు సోదాలు చేశారు. ఆగస్టు 31న దాదాపు 1,000 మంది పోలీసులతో విస్తృత సోదాలు నిర్వహించారు. తాంబరం అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సి మగేశ్వరి నేతృత్వంలో ఐదు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, ఇతర నిషేధిత నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 500 మంది మహిళా సిబ్బందితో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీసు బృందం ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది కళాశాల విద్యార్థులతో సహా 10 మందిని అరెస్టు చేశారు.
కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టి 500 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు, 20ml గంజాయి ఆయిల్, హుక్కా, స్మోకింగ్ పాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పలువురు కళాశాల విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

