శభాష్​పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం

ఆకేరు వాగుపై బ్రిడ్జి కొట్టుకు పోవడంతో ప్రయాణికులను బ్రిడ్జి దాటించారు మరిపెడ సీఐ, సిబ్బంది. పోలీసు యంత్రాంగం 16 గంటలకు పైగా నిరంతరం పనిచేసి రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించారు. రైల్వే అధికారులు ప్రయాణికులను వారి, వారి గమ్యస్థానాలకు రైళ్లను ఏర్పాటు చేశారు.

Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 02, 2024 | 3:14 PM

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పోలీసు యంత్రాంగం నిరంతరాయంగా పనిచేస్తున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామం వధ్ధ ఆకేరు వాగుపై బ్రిడ్జి కొట్టుకు పోవడంతో ప్రయాణికులను బ్రిడ్జి దాటించారు మరిపెడ సీఐ, సిబ్బంది. పోలీసు యంత్రాంగం 16 గంటలకు పైగా నిరంతరం పనిచేసి రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించారు. రైల్వే అధికారులు ప్రయాణికులను వారి, వారి గమ్యస్థానాలకు రైళ్లను ఏర్పాటు చేశారు.