Watch: అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. 70 గ్రాముల బంగారం, అరటిపళ్లు చోరీ.. వీడియో వైరల్

ఓ ఇంట్లోకి దూరిన దొంగలు రూ.5 లక్షల విలువైన బంగారం, అరటిపళ్లను చోరీ చేశారు. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంట్లోకి చొరబడ్డ ఈ చెడ్డీగ్యాంగ్‌ 70 గ్రాముల విలువైన బంగారం, అరటిపళ్లను దోచుకెళ్లింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.5లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Watch: అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. 70 గ్రాముల బంగారం, అరటిపళ్లు చోరీ.. వీడియో వైరల్
Underwear Gang
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Sep 03, 2024 | 3:52 PM

అర్ధరాత్రి చీకట్లో దోపిడీ. 5 లక్షల రూపాయలు, 70 గ్రాముల బంగారంతో పాటు కొన్ని అరటిపళ్లను కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లోని మాలెగావ్‌లో చోటుచేసుకుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పటికే పోలీసుల చేతికి అందింది. కొందరు యువకులు ఓ ఇంటి ఆవరణలోకి ప్రేశించి దొంగతనం చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దుండగులు చెడ్డీలు ధరించి ఉండటం వీడియోలో కనిపించింది. దీన్ని పోలీసులు ఇది చెడ్డీ గ్యాంగ్‌ పనిగా ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని నాసిక్‌ లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. మలేగావ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి దూరిన దొంగలు రూ.5 లక్షల విలువైన బంగారం, అరటిపళ్లను చోరీ చేశారు. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇంట్లోకి చొరబడ్డ ఈ చెడ్డీగ్యాంగ్‌ 70 గ్రాముల విలువైన బంగారం, అరటిపళ్లను దోచుకెళ్లింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.5లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..