Watch: ఓరీ దేవుడో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..! ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్‌ కోబ్రా.. పట్టుకోబోతే ఇలా..

ఇక్కడ పట్టుబడిన కింగ్‌ కోబ్రా పొడవు 11 అడుగులు కాడా, 6.7 కిలోల బరువు ఉన్నట్టుగా వెల్లడించారు. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందని చెప్పాడు. కాగా, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు దీనిపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు.

Watch: ఓరీ దేవుడో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం..! ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్‌ కోబ్రా.. పట్టుకోబోతే ఇలా..
Big King Cobra
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 04, 2024 | 9:45 AM

దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా భారీగా వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అడవులు, చెట్లు, పుట్టలు, గుట్టలు అన్ని ఊడ్చేస్తున్న వరద కారణంగా..అనేక జంతువులు, పాములు, తేళ్లు వంటివి జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. వరదల్లో కొట్టుకువచ్చిన పాములు తరచూ ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇంట్లోని సజ్జల మీద, బట్టలలో, వాహానాల్లో, హెల్మెట్ లు, బూట్లలో కూడా దూరిపోతుంటాయి. ఇలాంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాంటిదే ఈ ఘటన కూడా. ఒక ఇంట్లోకి భారీ పొడవైన కింగ్ కోబ్రా దూరింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని మయుర్ భంజ్ లో ఒక భారీ సర్పం హల్ చల్ చేసింది. బరిపాడ అటవీ డివిజన్ పరిధిలోని బాంగ్రా గ్రామంలో 11 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము కలకలం సృష్టించింది. అతి పొడవైన పామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్‌క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్నేక్ టీమ్.. అక్కడికి చేరుకుని పామును పట్టే ప్రయత్నం చేశారు. కానీ అది బుసలు కొడుతూ.. పలు మార్లు వారిని కాటేసేందుకు సైతం ప్రయత్నించింది. ఎట్టకేలకు అతి కష్టం మీద ఫారెస్ట్ అధికారులు, స్నేక్ టీమ్ సభ్యులు కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. అనంతరం సమీపంలోని అడవిలో వదలేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. ఇక్కడ పట్టుబడిన కింగ్‌ కోబ్రా పొడవు 11 అడుగులు కాడా, 6.7 కిలోల బరువు ఉన్నట్టుగా వెల్లడించారు. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందని చెప్పాడు. కాగా, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు దీనిపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..