Video: కళ్లు మూసి తెరిచేలోగా కానిచ్చేశాడు.. వరుడు చేసిన పనికి అంతా షాక్.. వైరల్ వీడియో..

దాంతో ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాగేసుకుంది. ఆ తరువాత వరుడు కొంత సమయం పాటు తల వంచుకుని అలాగే కూర్చుండిపోయాడు. ఆపై అతనికి అవకాశం వచ్చిన వెంటనే అతను అమ్మాయి చేతిలో ఉన్న రసగుల్లాను అమాంతంగా మింగేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Video: కళ్లు మూసి తెరిచేలోగా కానిచ్చేశాడు.. వరుడు చేసిన పనికి అంతా షాక్.. వైరల్ వీడియో..
Wedding Funny Viral Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 04, 2024 | 11:34 AM

పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి. అక్కడ వధూవరులు, వారి కుటుంబ సభ్యులు చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక పెళ్లి పందిట్లో వధూవరులను అంతా కలిసి ఆటపట్టిస్తుంటారు. అలాగే, కొన్ని సందర్భాల్లో వధువు వరుడు కూడా ఒకరినొకరు ఆటపట్టించుకునే ఘటనలు కూడా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో వరుడు చేసిన పనితో అందరూ కడుపుబ్బ నవ్వుకుంటున్నారు.

ఇక్కడ పెళ్లి మండపంలో వధూవరులు పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. వరుడి కుటుంబం ఒకవైపు కూర్చోవడం మరో వైపు వధువు తరఫు వారు నిలబడి ఉండడం వీడియోలో చూడవచ్చు. ఇంతలో వరుడికి రసగుల్లా తినిపించడానికి వధువు అక్కాచెల్లెల్లు అక్కడికి వస్తారు. కానీ వరుడు రసగుల్లా తినడానికి నోరు తెరవలేదు. దాంతో ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాగేసుకుంది. ఆ తరువాత వరుడు కొంత సమయం పాటు తల వంచుకుని అలాగే కూర్చుండిపోయాడు. ఆపై అతనికి అవకాశం వచ్చిన వెంటనే అతను అమ్మాయి చేతిలో ఉన్న రసగుల్లాను అమాంతంగా మింగేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో సోషల్ సైట్ Xలో షేర్‌ చేయబడింది. దీనికి 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. కాగా పలువురు నెటిజన్లు వీడియోపై ఫన్నీగా స్పందించారు. వరుడు చాలా తెలివైనవాడు అంటూ చాలా మంది నెటిజన్లు దీనిపై ఫన్నీగా వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..