Viral: పోతే ఒక్కడ్ని.. వస్తే పది మంది..! దేవుడిలా వచ్చి కాపాడాడు.. జేసీబీ డ్రైవరన్నా హ్యాట్సాఫ్
పోతే ఒక్కడ్నే.. వస్తే పది మంది.. ఇదేదో సినిమా డైలాగ్ అని అనుకోవద్దు. ఓ జేసీబీ డ్రైవర్ చేసిన సాహసం. వరద నీటిలో చిక్కుకున్న 9 మందిని.. జేసీబీ డ్రైవర్ సుభాన్ ధైర్యసాహసాలతో కాపాడాడు. ఇప్పుడు అతడు రియల్ హీరోగా..
పోతే ఒక్కడ్నే.. వస్తే పది మంది.. ఇదేదో సినిమా డైలాగ్ అని అనుకోవద్దు. ఓ జేసీబీ డ్రైవర్ చేసిన సాహసం. వరద నీటిలో చిక్కుకున్న 9 మందిని.. జేసీబీ డ్రైవర్ సుభాన్ ధైర్యసాహసాలతో కాపాడాడు. ఇప్పుడు అతడు రియల్ హీరోగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్లి కాపాడాడు జేసీబీ డ్రైవర్ సుభాన్. అధికారులు, NDRF సిబ్బంది, హెలికాప్టర్లు చేయలేని పనిని ఒక సామాన్యుడు.. అది కూడా జేసీబీ డ్రైవర్ ధైర్యంగా తన ప్రాణాలను పణంగా పెట్టి విపత్తులో ఉన్న 9 మందిని కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారిని కాపాడటానికి వెళ్లేముందు అతడు ‘పోతే ఒక్కడిని పోతా.. వస్తే వాళ్లతో పదిమంది వస్తాం’ అన్న మాటలు అందరికీ స్పూర్తినిస్తాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్లి.. ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావంటూ అతడ్ని పొగడ్తలతో ముంచెత్తారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
*ఒకే ఒక్కడు* JCB డ్రైవర్ పోతే ఒక్కడిని*.. *వస్తే మేము పది మంది💪 అని అధికారులు వారిస్తున్న JCB తో ముందుకు వెళ్లి 9 మంది ప్రాణాలు కాపాడిన హీరో.. ఖమ్మం జనం తరుపున నీకు సెల్యూట్ అన్న 🙏🏻 pic.twitter.com/0gZRHVtj9F
— Warrior (@warrior5506) September 2, 2024