Watch Video: టీం మెంబర్స్ ఇలా ఉంటే కొంపకొల్లేరే.. ఆలోచింప చేస్తున్న ఆనంద్ మహీంద్ర ఫన్నీ వీడియో..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామి వేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా రకరకాల పోస్ట్‌లు చేస్తుంటారు. వీటిలో మెజారిటీ పోస్ట్‌లు స్ఫూర్తిదాయకమైనవే ఉంటాయి..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామి వేత్త ఆనంద్ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదికగా రకరకాల పోస్ట్‌లు చేస్తుంటారు. వీటిలో మెజారిటీ పోస్ట్‌లు స్ఫూర్తిదాయకమైనవే ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరికీ మోటివేషన్ ఇచ్చేలా ఉంటాయి ఆనంద్ మహీంద్ర షేర్ చేసే వీడియోలు. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు మహీంద్ర.
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియోలో రెండు పక్షులు ఉన్నాయి. వీటిలో ఒక పక్షి ఒక గుంత నుంచి ఇసుకను తవ్వుతు బయట పడేస్తుంది. అదే సమయంలో మరో పక్షి మాత్రం బయట ఉన్న ఇసుకను లోపలికి నెట్టేస్తోంది. దీంతో మొదటి పక్షి ఎంత కష్టపడి ఇసుకను బయటకు పంపిస్తున్నా, రెండో పక్షి తిరిగి ఇసుకను నెట్టుతుండడంతో దాని కష్టమంతా వృథా అవుతుంది. దీనిని వర్క్ కల్చర్‌కి సింక్ చేసిన ఆకట్టుకునే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు మహీంద్ర.
Sometimes, in the middle of the week, this is what it feels like you’ve been doing in a project team. ? Make sure you’re all working towards the same objective… pic.twitter.com/3pFSkm95Tl
— anand mahindra (@anandmahindra) November 23, 2022
ఈ వీడియోతో పాటు.. ‘కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు ఎందుకు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా విస్మరిస్తుంటారు. అయితే టీమ్‌లో పనిచేసే వారందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి. అలా కాకుండా ఒకరికొకరు సంబంధం లేకుండా పనిచేసుకుంటూ పోతుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న’ అర్థం వచ్చేలా రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..