Childhood Photo: ఈ అమాయకపు బొమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇక సినిమా తరాలకు సంబంధించిన విషయాలైతే ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే క్రేజీ హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి.

Childhood Photo: ఈ అమాయకపు బొమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా..?
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2022 | 3:33 PM

సోషల్ మీడియా అనేది ఓ కొత్త ప్రపంచం.. ఈమధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం చాలా ఎక్కువైపోయింది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన అది క్షణంలో మన ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. ఇక సినిమా తరాలకు సంబంధించిన విషయాలైతే ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే క్రేజీ హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు ఇప్పుడు హాట్ బ్యూటీ.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ. పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నది. ఇప్పుడు తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది.

ఇంతకు ఈ భామ ఎవరంటే.. పై ఫొటోలో స్కూల్ డ్రస్ లో అమాయకంగా చూస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు అందాల భామ శ్రియ. ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రియ. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోయింది. టాలీవుడ్లోనే కాదు తమిళ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ. ఇక శ్రియ గ్లామర్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

ప్రస్తుతం పెళ్లి చేసుకొని భర్తతో పాపతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ చాల యాక్టివ్ గా ఉంటుంది. తమ పాపతో భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది శ్రియ..

ఇవి కూడా చదవండి
Shriya Saran

Shriya Saran

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..