AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Gokhale: నటుడు చనిపోయాడంటూ ట్విట్టర్‌లో సంతాపం తెలిపిన స్టార్స్‌.. స్పందించిన కుటుంబ సభ్యులు

ఇటీవల ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చనిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు అలాంటిది మరొకటి జరిగింది.

Vikram Gokhale: నటుడు చనిపోయాడంటూ ట్విట్టర్‌లో సంతాపం తెలిపిన స్టార్స్‌.. స్పందించిన కుటుంబ సభ్యులు
Vikram Gokhale
Basha Shek
|

Updated on: Nov 24, 2022 | 12:48 PM

Share

సినిమా తారల ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు బాగా వైరలవుతున్నాయి. నటుల ఆరోగ్యం విషమించిందని, ఆస్పత్రిలో చేరారని సోషల్‌ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తున్నాయి. కొందరైతే చనిపోయారంటూ ఏకంగా పోస్టులు షేర్‌ చేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే చనిపోయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు అలాంటిది మరొకటి జరిగింది. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు విక్రమ్‌ గోఖలే మృతిచెందినట్లు నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సామన్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్‌ వేదికగా గోఖలే మృతికి సంతాపం కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆయనింకా జీవించే ఉన్నారు..

‘విక్రమ్‌ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది గోఖలే ఫ్యామిలీ. కాగా 77 ఏళ్లున్న విక్రమ్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో విక్రమ్‌ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అప్పటికే మీడియాతో పాటు కొన్ని వెబ్‌సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

హిందీతో పాటు మలయాళం, గుజరాతీ సినిమాల్లోనూ గోఖలే నటించారు. 90కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మిషన్‌ మంగళ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భూల్ భులయ్యా, దిల్ సే, దే దానా దాన్, హిచ్కీ, నికమ్మ, బ్యాంగ్‌ బ్యాంగ్‌ వంటి హిట్‌ సినిమాల్లోనూ ఆయన కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!