Shriya Saran: అందరి ముందు భర్తకు శ్రియ లిప్ కిస్.. ట్రోల్ చేస్తున్న వారికి అమ్మడి అదిరిపోయే కౌంటర్..
2001లో వచ్చిన 'ఇష్టం' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార శ్రియ. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌లో జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన శ్రియ..
2001లో వచ్చిన ‘ఇష్టం’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార శ్రియ. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌లో జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన శ్రియ.. అనంతరం హిందీతో పాటు ఇతర భాషల్లోనూ నటించింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు అవుతోన్నా ఇప్పటికీ సినిమా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంటుందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే 2018లో ఆండ్రీని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం భర్తతో సంతోషంగా గడుపుతోంది. భర్తతో గడిపే మధుర క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం శ్రియకు అలవాటు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో భర్తతో క్లోజ్‌గా దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతుటుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీయా తాజాగా నటించిన చిత్రం ‘దృశ్యం2’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ అందాల తార.. భర్తకు అందరు చూస్తుండగానే లిప్ కిస్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైర్ అవుతోంది. అయితే ఈ ఫొటో చూసిన కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. శ్రియపై ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
దీంతో ఈ ట్రోలింగ్‌పై రియాక్ట్ అయ్యింది శ్రియ. ఈ విషయమై మాట్లాడుతూ.. ‘నా ప్రత్యేకమైన క్షణాల్లో నాకు ముద్దు పెట్టడం నా భర్తకు సరదా. నా వరకు ఇదొక అందమైన అనుభూతి. భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడాన్ని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ.. ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను చెత్త కామెంట్స్ చదవను. వాటికి స్పందించను. ఎందుకంటే ట్రోల్స్ చేయడం వారి ఉద్యోగం. వాటిని పట్టించుకోకపోవడం నా ఉద్యోగం. నేను చేయాలి అనుకున్నదే చేస్తా’ అంటూ తనదైన శైలిలో కుండ బద్దలు కొట్టేలా సమాధానం ఇచ్చిందీ బ్యూటీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..