Optical Illusions: దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే.. ఈ ఫొటోలో దాగున్న పామును గుర్తించే సత్తా మీకుందా.?
కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ అంశం ట్రెండింగ్ అవుతోంది. వైరల్ వీడియోలు, వైరల్ ఫొటోలు ఇలాంటి జాబితాలోకి ఆప్టికల్ ఇల్యూజన్ కూడా చేరాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో..

కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ అంశం ట్రెండింగ్ అవుతోంది. వైరల్ వీడియోలు, వైరల్ ఫొటోలు ఇలాంటి జాబితాలోకి ఆప్టికల్ ఇల్యూజన్ కూడా చేరాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ ఫొటోలో పులి దాగి ఉంది కనుగొనండి అంటూ రకరకాల ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను గందరగోళానికి గురి చేస్తోంది. పైన ఫొటో చూస్తే ఏం కనిపిస్తోంది. సాయంకాలాన ఓ వ్యక్తి కుర్చిపై సేదతీరుతున్నట్లు కనిపిస్తోంది కదూ.! అక్కడ ఓ తేలు కూడా పాకుతూ వస్తోంది. అయితే ఇందులో ఓ పాము దాగి ఉందన్న విషయం మీకు తెలుసా.? అక్కడే కనిపించీ కనిపించకుండా ఓ పాము పాకుతోంది చూడండి. నిజంగా మీ కళ్లల్లో పవర్ ఉంటే ఆ పామును ఏడు సెకండ్స్‌లో కనిపెట్టాలి. ఏంటి ఎంత వెతికినా పాము కనిపించడం లేదా.
అయితే ఓసారి ఆ కూర్చున్న వ్యక్తి పైన లాంతర్ కనిపిస్తోంది కదూ! దానిపై ఓ లుక్కేయండి.. ఆ లాంతర్‌కు అనుకొని నెమ్మదిగా పాకుతోన్న పాము కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పామును కనిపెట్టండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేసి పామును కనిపెట్టమని ఛాలెంజ్ విసరండి. వారు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..