AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పెళ్లి శుభలేఖలు అమ్మి కోటి సంపాదించిన జంట.. ఆ డబ్బులతో చేసిన పని తెలిస్తే శభాష్ అనాల్సిందే

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని యాడ్ తరచుగా చూస్తూనే ఉన్నాం.. అదే విధంగా ఒక జంట తమ పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. ప్రస్తుతం ఈ వివాహ జంటకు సంబంధించిన కథ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కోటి రూపాయలు వసూలు చేసారనే విషయం తెలిసి ఆశ్చర్య పోయారు. ఆ డబ్బులను ఒక మంచి పనికి విరాళంగా ఇచ్చారని తెలిసి ఆ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral News: పెళ్లి శుభలేఖలు అమ్మి కోటి సంపాదించిన జంట.. ఆ డబ్బులతో చేసిన పని తెలిస్తే శభాష్ అనాల్సిందే
Viral NewsImage Credit source: Pixabay
Surya Kala
|

Updated on: Aug 09, 2025 | 3:17 PM

Share

మన దేశంలో పెళ్లిళ్లు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా అందరూ పెళ్లికి హాజరు కావాలని కోరుకుంటారు, పెళ్లి వేడుకలో దంపతులను ఆశీర్వదించి తమ శక్తికి తగిన విధంగా కానుకలను అందజేస్తారు. అయితే ఎవరైనా కొత్త జంట తమ పెళ్లిని వ్యాపారంగా మార్చుకుంటుందని ఊహించారా..! కొంచెం వింతగా అనిపించవచ్చు.. కానీ నిజంగా తన పెళ్లి వేడుకని వ్యాపర కేంద్రంగా మార్చింది కొత్త జంట. ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అమెరికా నివాసితులు అయిన మార్లే జాక్వెస్, స్టీవ్ జె లార్సన్ పెళ్లి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ జంట తమ వివాహాన్ని డిఫరెంట్ గా చేసుకున్నారు. తమ పెళ్ళికి వచ్చే అతిధులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆ జంట డబ్బు సంపాదించడానికి ఇలా చేయలేదు. వారి ఆలోచన వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. వీరు వివాహం ప్రజలను షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఈ పెళ్ళికి హాజరు కావడానికి అతిథులు శుభలేఖలు పట్టుకుని వెళ్ళలేదు.. పెళ్ళికి హాజరయ్యేందుకు టిక్కెట్లు కొనవలసి వచ్చింది.

పెళ్లిలో కోట్లు ఎలా సంపాదించారంటే ఈ జంట మీడియాతో మాట్లాడుతూ సాంప్రదాయ వివాహాల్లో ఖర్చు చేసే డబ్బులో ఎక్కువ భాగం వృధా అవుతుందని… అందుకే తమ వివాహానికి అయ్యే ఖర్చు విషయంలో ప్రత్యెక శ్రద్ధ పెట్టినట్లుచేప్పారు. తమ హాజరయ్యే అతిధుల కోసం రెండు రకాల వివాహ ఆహ్వాన కార్డులను తయారు చేసుకున్నారు. ఒకటి ప్రాధమిక పెళ్లి కార్డ్.. దీని ధర రూ.4,750. మరొకటి రూ.83,000 ధర ఇది VIP పెళ్లి కార్డ్.

ఇవి కూడా చదవండి

అంటే పెళ్ళికి హాజరయ్యేందుకు బేసిక్ కార్డు కొనుగోలు చేస్తే వారు ప్రధాన వివాహ వేడుక , రిసెప్షన్‌కు మాత్రమే హాజరయ్యే అవకాశంకలిగింది. అయితే VIP టికెట్‌లో ఇద్దరికి విందు, వివాహానంతర బ్రంచ్, ఇతర ప్రత్యేక సేవలను కల్పించారు. ఆశ్చర్యకరంగా ఈ జంట 100 బేసిక్ టిక్కెట్లు , 30 VIP టిక్కెట్లను విక్రయించారు. ఇలా టికెట్లు అమ్మి ఈ జంట సువారు 1 కోటి రూపాయలకు పైగా సేకరించారు. వివాహానికి ఖర్చు లు పోగా మిగిలిన డబ్బు (సుమారు 84 లక్షల రూపాయలు) “విలేజ్ ఇంపాక్ట్” అనే NGOకి విరాళంగా ఇచ్చారు. ఈ NGO కెన్యాలో విద్య ,పాఠశాల మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పనిచేస్తుంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..