AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నోట్లో అన్నం పెడితే చాలు.. బుడ్డోడికి వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా..

రాఖీ పండుగ వేళ.. అన్ని కుటుంబాల్లో అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటుంటే.. ఆ కుటుంబం మాత్రం తీవ్ర ఆందోళనలో ఉంది. కారణం ఏడాది వయస్సున్న వారి ముద్దుల తనయుడికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆహారం నోట్లో పెడితే చాలు.. చిన్నోడు వాంతులు చేసుకుంటున్నాడు.

Viral: నోట్లో అన్నం పెడితే చాలు.. బుడ్డోడికి వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా..
Child
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2025 | 5:10 PM

Share

మధ్యప్రదేశ్‌ ఖాండ్వాలో ఏడాది వయస్సు ఉన్న బాలుడికి ఉన్నపలంగా వాంతులు స్టార్టయ్యాయి. అన్నం జీర్ణం అవ్వలేదేమో అని సిరప్ వేశారు. అయినా సరే వాంతులు ఆగకపోగా.. ఇంకాస్త ఎక్కువయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ చిన్నోడికి టెస్టులు చేసిన డాక్టర్లు బుడ్డోడి గొంతులో ఏదో చిన్నపాటి వస్తువు ఉండటాన్ని గుర్తించారు. ఆ తర్వాత పరిశీలించగా అది రాఖీకి అమర్చిన LED లైట్‌ అని తేలింది. రాఖీకి అమర్చిన LED లైట్‌ను బాలుడు అనుకోకుండా మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో నిరంతరం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో.. వారికి తొలుత వాంతులు ఎందుకు అవుతున్నాయో అర్థం కాలేదు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు త్వరగా చర్య తీసుకుని అతని గొంతు నుంచి LED బల్బ్‌ను తొలగించారు. చిన్నోడు కోలుకున్నాడని.. డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

ఆ చిన్నారికి చికిత్స చేసిన రెసిడెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ.. ఎక్స్-రేలో గొంతులో ఏదో ఉన్నట్లు నిర్ధారించామని చెప్పారు. లేపరోస్కోపిక్ పద్దతిలో దాన్ని తొలగించినట్లు వివరించారు. ఆ బాలుడి తండ్రి మనీష్ పటేల్ మాట్లాడుతూ.. రాఖీలో LED అమర్చారని చెప్పారు. తాము అతనికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారీ.. బాబు వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు గొంతు నుంచి లైట్ తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక, బాలుడిని కొన్ని రోజులు పరిశీలనలో ఉంచారు. ఇప్పుడు అతను డిశ్చార్జ్ అయ్యాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
పెట్రోల్‌ vs ఎలక్ట్రిక్‌.. ఏ కారు కొంటే మంచిది?
పెట్రోల్‌ vs ఎలక్ట్రిక్‌.. ఏ కారు కొంటే మంచిది?
వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!
వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!
నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. లింక్‌
నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. లింక్‌
దేశంలో నీటి అడుగున తొలి రోడ్డు, రైలు సొరంగం.. ఎక్కడంటే..
దేశంలో నీటి అడుగున తొలి రోడ్డు, రైలు సొరంగం.. ఎక్కడంటే..