AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Isha Ambani: ఇషా అంబానీ రాయల్‌ లుక్‌.. ఈ బర్త్‌డే డ్రెస్‌ ఖరీదు తెలిస్తే..

జామ్‌నగర్‌లో జరిగిన ఫ్యాషన్‌స్టార్‌, అంబానీ వారసురాలు ఇషా అంబానీ 34వ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దీంతో మరోసారి జామ్‌నగర్‌, అంబానీ కుటుంబం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఇషా, ఆకాష్ అంబానీ, మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు, బాలీవుడ్ అతిపెద్ద తారలు గత కొన్ని రోజులుగా జామ్‌నగర్‌లో దిగడం కనిపించింది. ఇప్పటివరకు చాలా వేడుకలు రహస్యంగా ఉన్నప్పటికీ, ఇషా అంబానీ తన పుట్టినరోజు డ్రెస్‌తో కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించి చర్చనీయాంశంగా మారాయి.

Isha Ambani: ఇషా అంబానీ రాయల్‌ లుక్‌.. ఈ బర్త్‌డే డ్రెస్‌ ఖరీదు తెలిస్తే..
Isha Ambani
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2025 | 8:06 AM

Share

అంబానీ తోబుట్టువులు ఇషా,ఆకాష్ అంబానీ బర్త్‌డే వేడుక ఘనంగా జరిగింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కుటుంబ సమేతంగా వారు తమ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఇషా, ఆకాష్‌ కవలలు కావడంతో ఇద్దరిదీ ఒకేరోజున బర్త్‌డే వేడుకను ఎంతో అట్టహాసంగా జరుపుకుంది అంబానీ ఫ్యామిలీ. ఈ సందర్భంగా కొన్ని రోజులుగా బాలీవుడ్ అతిపెద్ద తారలు జామ్‌నగర్‌లో దిగడం కనిపించింది. ఇప్పటివరకు చాలా వేడుకలు రహస్యంగా ఉన్నప్పటికీ, ఇషా అంబానీ తన పుట్టినరోజు డ్రెస్‌లో ఉన్న కొన్ని ఫోటోలు ఇంటర్‌నెట్‌లో కనిపించాయి. ఇషా ధరించిన డ్రెస్‌ ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ధరించిన డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు..

అంబానీ వారసులు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ తమ పుట్టినరోజులను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుపుకున్నారు. ఈ కవలల పుట్టిన రోజు వేడుకలకు వారి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం గ్రాండ్‌గా ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో అద్భుతమైన డ్రోన్ షో కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్టీ నుండి ఇషా అద్భుతమైన పుట్టినరోజు లుక్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో ఆమె చాలా అందంగా ఉంది. ఇషా తన పుట్టినరోజు వేడుకల్లో ధరించిన డ్రెస్‌ మరింత అట్రాక్షన్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 25న ఇషా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ బియాంకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు వేడుకల ఫోటోలను షేర్‌ చేసి, అందమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాశారు. ఈ ఫోటోలో ఇషా ఎరుపు రంగు, సీక్విన్‌తో డిజైన్‌ చేసిన బ్లౌజ్, స్కర్ట్ సెట్‌ ధరించి కనిపించారు.

ఇషా అంబానీ తన పుట్టినరోజు వేడుకకు లండన్‌కు చెందిన ఒక బ్రాండ్ నుండి ఈ డ్రెస్‌ని సెలక్ట్‌ చేసుకున్నారు. ఈ డ్రెస్‌ ఖరీదు దాదాపు రూ. 1,34,000 ఉంటుందని సమాచారం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?