100ఏళ్లనాటి ఇంటిని కొన్న జంటకు జాక్‌పాట్.. పాత కార్పెట్ కింద దాగివున్న నిధి..!
చాలా మంది పురాతన వస్తువులు, పూర్వకాలం నాటి నిర్మాణాలను ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే కొందరు అలాంటి పాత వస్తువులు, ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. పాత, పురాతన ఇంటిని కొనుగోలు చేసి వాటికి మర్మమతులు చేసి కొత్తగా మార్చుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి పని చేసిన ఓ జంటకు ఊహించని నిధి దొరికింది. 100ఏళ్ల నాటి పాత ఇంటిని కొన్న ఒక జంటకు జాక్ పాట్ తగిలింది. ఆ ఇంట్లో ఉన్న పాత కార్పెట్ వారికి కలిసి వచ్చేలా చేసింది..పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లాండ్‌లోని ఒక జంట 100 సంవత్సరాల పురాతనమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆ ఇంటిని మరమ్మతులు చేయించే పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇంట్లోని పాత కార్పెట్‌ను తీసి బయటపడేయాలని చూశారు.. అక్కడే వారికి ఆశ్చర్యం కలిగించే దృశ్యం కనిపించింది. ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో నివసిస్తున్నఈ జంట, తమ కొత్త ఇంటిని తిరిగి అందంగా మార్చుకునే క్రమంలో వారికి కార్పెట్ రూపంలో ఎప్పుడూ ఊహించని నిధిని గుర్తించారు. వారు పాత కార్పెట్‌ను తీస్తేస్తుండగా, దాదాపు చెక్కు చెదరకుండా ఉన్న అందమైన హెరింగ్‌బోన్‌తో తయారు చేసిన చెక్క ఫ్లోర్ వారికి కనిపించింది.
ఇది ఇటీవల దాదాపు 100 సంవత్సరాల పురాతనమైన ఇంటిని కొనుగోలు చేసిన సామ్ ఫ్రిత్, బెకా గ్రేస్ కథ. వారు గత కొన్ని వారాలుగా తమ ఇంటి రిపేర్ వర్క్స్, తిరిగి అందంగా అలంకరించుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ వారి కాళ్ళ కింద అప్పటికే బ్యూటీఫుల్ డిజైనర్ ఫ్లోర్ దాగి ఉందని వారికి తెలియదు. బెక్కా, సామ్ తమ హాలులో నుండి పాత కార్పెట్‌ను తీసివేసినప్పుడు, కింద కనిపించిన దానిని చూసి వారు ఆశ్చర్యపోయారు. అక్కడ హెరింగ్‌బోన్ నమూనాలో వేయబడిన అద్భుతమైన చెక్క ఫ్లోర్ ఉంది. ప్రస్తుతం ఇలాంటి హై-ఎండ్ ఇంటీరియర్ డిజైన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఫ్లోరింగ్ చూసిన తరువాత బెక్కా ఇలా వివరించాడు, మా ఇద్దరికీ ఇంటి మరమ్మతుల విషయంలో అనుభవం లేదు. కానీ, మేము కార్పెట్‌ను తీసివేసినప్పుడు మాకు నిజంగానే జాక్‌పాట్ తగిలినట్టుగా అనిపించింది. ఈ ఫ్లోరింగ్‌ను కార్పెట్, అండర్‌లేమెంట్ కింద సంవత్సరాలుగా పాడవకుండా రక్షించింది. అందుకే ఇది అంత మంచి స్థితిలో ఉంది. ఇది చూసేందుకు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని చెప్పాడు. అంతేకాదు.. తమకు ఆర్థికంగా కూడా కలిసి వచ్చిందని చెప్పారు. అదే ఫ్లోరింగ్‌ను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయాలంటే దాని ధర దాదాపు £1,800 (సుమారు రూ. 1.9 లక్షలు) ఉండేదని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




