గీతాంజలి సినిమాకు మించిన స్టోరీ.. కిడ్నీ కోసం క్యాన్సర్ రోగితో అగ్రిమెంట్ పెళ్లి.. కట్ చేస్తే
వివాహం రెండు హృదయాల కలయిక అని అంటారు. కానీ, ఈ జంట దానిని ఒక ఒప్పందంగా మార్చుకుంది. యురేమియా అనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ క్యాన్సర్ రోగిని వివాహం చేసుకుంది. అతని మరణానంతరం ఆమె అతడి కిడ్నీని తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నారు. కానీ, ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంగా మొదలైన ఈ సంబంధం క్రమంగా నిజమైన ప్రేమగా వికసించింది. వారి వివాహ జీవితంలో జరిగిన ఊహించని అద్భుతంతో వారిద్దరూ అనారోగ్యం నుడి కోలుకున్నారు. ఇద్దరూ కలిసి పూల దుకాణం నడుపుతూ సరి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వీరి పూర్థి కథలోకి వెళితే..

కిడ్నీ ఫుయిల్యూర్‌కి కారణమయ్యే యురేమియా అనే వ్యాధితో బాధపడుతున్న చైనాకు చెందిన ఒక మహిళ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. అదేంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మరొక అనారోగ్య వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకుంటుంది..? వారిని ఎవరు చూసుకుంటారు అనే సందేహం కలుగుతుందేమో..? కానీ వాస్తవానికి, వారి వివాహం ఒక ఒప్పందం. అతని చికిత్స సమయంలో ఆమె అతనిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అతని మరణం తర్వాత అతని కిడ్నీని తను తీసుకుంటుంది. ఇలా వారు అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహ బంధం రాజీగా అనిపించినప్పటికీ కాలక్రమేణా నిజమైన ప్రేమగా వికసించింది.
షాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల వాంగ్ జియావోకు యురేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పుడు వైద్యులు ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు. లేదంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమని చెప్పారు. ఆమె కుటుంబంలో సరిపోయే దాత దొరకకపోవడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలోనే మరొక రోగి సలహా మేరకు ఆమె క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌లో వివాహ ప్రకటనను పోస్ట్ చేసింది. కానీ, ఆమె అభ్యర్థన చాలా భిన్నంగా ఉంది. ఆమె తనను వివాహం చేసుకునే వ్యక్తి ప్రాణాంతక వ్యాధిగ్రస్తుడై ఉండాలి. తద్వారా అతని మరణం తర్వాత అతని కిడ్నీని ఆమె తీసుకుంటుంది. కానీ, ఇక్కడ మరోక విషయం ఏంటే.. వివాహం తర్వాత ఆమె తన భర్తను అన్ని విధాలా చూసుకుంటానని చెప్పింది. దయచేసి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తనకు బ్రతకాలనే కోరిక బలంగా ఉందని ఆమె రాసింది.
ఆమెకు పోస్ట్‌కు సమాధానం దొరికింది. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 27 ఏళ్ల యు జియాన్‌పింగ్ ఆమె ప్రకటనకు ప్రతిస్పందించారు. అతని చికిత్స కోసం తల్లిదండ్రులు అన్ని కోల్పోయారు. చివరకు అతని తల్లి మరణించింది. అతని తండ్రి తన కొడుకు చికిత్స కోసం ఇంటిని కూడా అమ్మేశాడు. ఇలాంటి టైమ్‌లో జియావో పోస్ట్ చూసిన యు జియాన్ ఆమెను సంప్రదించాడు. జూలై 2013లో వీరు నిరాడంబరంగా ఒప్పందం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు దాచిపెట్టి, ఒకరి బాధ్యతను ఒకరు తీసుకున్నారు. ఒకరికి ఒకరు ఆర్థికంగా అండగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు.
ఒప్పందం ప్రకారం, యు మరణం తరువాత, అతను తన కిడ్నీని వాంగ్‌కు దానం చేస్తాడు. వాంగ్ అతనిని, అతని తండ్రిని చూసుకుంటుంది.. కానీ కాలక్రమేణా, వారి సంభాషణలు, కష్టాలు వారిని దగ్గర చేశాయి. వాంగ్ వేసే జోకులు యు విచారాన్ని కనిపించకుండా చేసేవి. యు కూడా అతని జీవితాంతం ఆమెకు అండగా ఉంటానని భరోసా నిచ్చాడు. చికిత్స సమయంలో ఇరువురు ఒకరికి ఒకరు అండగా, చేదోడువాదోడుగా ఉండేవారు. యు ప్రతి చికిత్సా సెషన్‌కు అతనితో పాటు ఆస్పత్రికి వెళ్లేది. అతనికి ఆహారం, సూప్‌లు వంటివి అందిస్తూ అతనికి సపర్యాలు చేసింది.
ఈ క్రమంలోనే వారికి ఒకరంటే ఒకరికి ప్రేమ పెరిగింది. ఆ ప్రేమ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. బ్రతుకు మీద ఆశతో ఆమె రోడ్డు పక్కన పూల బొకేలు అమ్మడం ప్రారంభించింది. ప్రతి బొకేలో తన ప్రత్యేకమైన కథతో కూడిన చేతితో రాసిన కార్డు ఉండేది. ఈ కథ ప్రజల హృదయాలను తాకింది. క్రమంగా, అనేక మంది వారికి మద్ధతుగా నిలిచారు. వారికి వ్యాపారంలో సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాంగ్ దాదాపు 500,000 యువాన్లను సేకరించాడు. ఇది యు ఎముక మజ్జ మార్పిడికి సరిపోతుంది. జూన్ 2014 నాటికి యు ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమైంది.
ఆశ్చర్యకరంగా, వాంగ్ పరిస్థితి కూడా మెరుగుపడింది. ఆమెకు ఇకపై తరచుగా డయాలసిస్ అవసరం లేదు. ఆమెకు కిడ్నీ మార్పిడి అవసరం ఉండకపోవచ్చని వైద్యులు అంచనా వేశారు. జీవితంలో ఈ రెండవ అవకాశాన్ని,వారి నిజమైన సంబంధాన్ని జరుపుకోవడానికి, వారు ఫిబ్రవరి 2015లో ఒక చిన్న రెస్టారెంట్‌లో వివాహ విందును ఏర్పాటు చేశారు. ఈ రోజు, ఈ జంట షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్‌లో పూల దుకాణం నడుపుతున్నారు. ఇద్దరూ మెరుగైన ఆరోగ్యంతో ఉన్నారు.ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




