బట్టతల వారికి సూపర్ గుడ్‌న్యూస్..! కేవలం 20 రోజుల్లోనే జుట్టు పెంచే సీరం వచ్చేసిందోచ్..
బట్టతల, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు అద్దిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. మీరు బట్టతల సమస్యతో బాధపడుతుంటే, మార్కెట్లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ని ప్రయత్నించిన తర్వాత నిరాశ చెందుతుంటే.. ఈ వార్త మీకో ఆశాకిరణం కావచ్చు. అవును.. ఎందుకంటే..ఇటీవల శాస్త్రవేత్తలు కేవలం 20 రోజుల్లో బట్టతలపై జుట్టు పెంచగలని అద్భుత సీరంను తయారు చేశారు.

బట్టతల, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు అద్దిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. మీరు బట్టతల సమస్యతో బాధపడుతుంటే, మార్కెట్లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ని ప్రయత్నించిన తర్వాత నిరాశ చెందుతుంటే.. ఈ వార్త మీకో ఆశాకిరణం కావచ్చు. అవును.. ఎందుకంటే..ఇటీవల శాస్త్రవేత్తలు కేవలం 20 రోజుల్లో బట్టతలపై జుట్టు పెంచగలని అద్భుత సీరంను తయారు చేశారు. ఈ సీరం జుట్టు కుదుళ్లను మళ్లీ సజీవం చేసే విధంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకు సంబంధంచి నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో వెల్లడించారు. దీనిని నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సీరం ఎలా పనిచేస్తుంది..? దాని ప్రత్యేకత ఏమిటి..? ఇది నిజంగా బట్టతలకి నివారణ కాగలదా..? అనే ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చూద్దాం..
శాస్త్రవేత్తల వివరణ మేరకు..పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ సీరంను ప్రయోగించగా అది పని చేసిందని వివరించారు. ఈ సీరం అప్లై చేయటం వల్ల చర్మం క్రింద ఉండే కొవ్వు కణాలను ఉత్తేజపరిచి, జుట్టు కుదుళ్లను తిరిగి పెరిగేలా చేయడంలో విజయవంతమైందని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రక్రియ హైపర్ట్రైకోసిస్ అనే విధానంపై ఆధారపడి ఉందని వెల్లడించారు. దీని ప్రకారం చర్మానికి కలిగే చిన్నపాటి చికాకు, గాయంలాంటివి లేకుండా ఎక్కువగా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని వెల్లడించారు. ఈ సీరంలో సహజ ఫ్యాటీ యాసిడ్లు ముఖ్యంగా ఓలిక్ యాసిడ్, పామిటోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్ల మూల కణాలను ఉత్తేజపరచి, కొత్త వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.
ప్రొఫెసర్ సంగ్-జాన్ లిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సీరంను మొదట పరిశోధకులు తమ కాళ్లపై పరీక్షించగా, మూడు వారాల్లోనే జుట్టు తిరిగి పెరిగిందని తెలిపారు. ఈ ఫలితాలు మానవ చర్మానికి కూడా అన్వయిస్తాయని, త్వరలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ సీరంకు పేటెంట్ లభించింది. ఇక త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆవిష్కరణ జుట్టు రాలిపోవడం, బట్టతల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారంగా మారే అవకాశముంది.
🧴 Baldness — over: scientists have created a serum that restores hair in just 20 days
Researchers in Taiwan tested a new formula on mice — and within three weeks, completely bald animals started growing fur again.
The secret lies in natural fatty acids that stimulate hair… pic.twitter.com/8Jj25wrmQG
— NEXTA (@nexta_tv) October 24, 2025
ఈ పరిశోధన ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక శాస్త్రీయ పత్రికలలో ఒకటైన నేచర్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ సీరం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టును బలోపేతం చేస్తుందని శాస్త్రవేత్తలు నివేదించారు. ఇందులో స్టెరాయిడ్లు లేదా హానికరమైన రసాయనాలు లేవని చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రయోగం నిజంగానే బట్టతల వారికి గొప్ప భరోసా కానుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




