Guava Fruits: జామ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరు తిన్నారో బండి షెడ్డుకే!
జామపండ్లు రుచికి బలేగా ఉంటాయి. వీటిల్లో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జామ జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గిస్తుంది. అదనంగా దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి రక్షిస్తాయి. .
Updated on: Oct 29, 2025 | 2:00 PM

జామలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జామపండ్లు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. ఇవి కొంతమందికి మేలు కంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి వారు జామపండ్లు తినకపోవడమే మంచిది. ముఖ్యంగా అలెర్జీ ఉన్నవారు ఈ పండు తినకూడదు. జామపండు తినడం వల్ల కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు సంభవించవచ్చు. ఇలాంటి వారు అస్సలు తినకూడదు.

జామపండు తిన్న తర్వాత మీ శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, గుండెల్లో మంట లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా జామ తినకూడదు. జామలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

జామ రుచికి భలేగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి6, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జామలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.




