AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pepper Rice: జలుబుకు మందు ఇంట్లోనే.. ఘాటైన మిరియాల అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్

వాతావరణ మార్పుల సమయంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పికి మన వంటింట్లోనే ఒక అద్భుతమైన ఔషధం ఉంది. అదే.. ఘాటు రుచిని, ఔషధ గుణాలను అందించే పెప్పర్ రైస్ (మిరియాల అన్నం). దక్షిణాది సంప్రదాయంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. నల్ల మిరియాలలో ఉండే 'పైపెరైన్' అనే శక్తిమంతమైన రసాయనం శ్లేష్మాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ సులభమైన రెసిపీ తయారీ విధానం, అది జలుబును ఎలా తగ్గిస్తుందనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Pepper Rice: జలుబుకు మందు ఇంట్లోనే.. ఘాటైన మిరియాల అన్నం.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Pepper Rice Recipe
Bhavani
|

Updated on: Oct 28, 2025 | 8:16 PM

Share

చలికాలంలో లేదా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పికి మన పూర్వీకులు ఆయుర్వేదంగా ఉపయోగించిన ఆహారమే ఈ ఘాటైన పెప్పర్ రైస్ లేదా మిరియాల అన్నం. రుచితో పాటు ఔషధ గుణాలు మెండుగా ఉండుట వలన, ఇది అనారోగ్యంతో ఉన్నవారికి త్వరగా ఉపశమనం ఇస్తుంది.

తయారీకి కావలసినవి అన్నం (పొడిపొడిగా వండినది): 2 కప్పులు

మిరియాలు (తాజాగా దంచిన పొడి): 1.5 టీ స్పూన్లు

జీలకర్ర: 1 టీ స్పూన్

నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి (మధ్యకు చీల్చినవి): 2

ఎండు మిర్చి: 2

ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు: 1/2 టీ స్పూన్ చొప్పున

కరివేపాకు: కొద్దిగా

జీడిపప్పు/పల్లీలు : కొద్దిగా

ఉప్పు: రుచికి సరిపడా

ఇంగువ : చిటికెడు

మిరియాల అన్నం తయారీ విధానం

అన్నాన్ని పొడిపొడిగా వండి, వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లార్చాలి.

స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి/నూనె వేడి చేయాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ (ఐచ్ఛికం), జీడిపప్పు/పల్లీలు వేసి వేయించాలి. పోపు సిద్ధమయ్యాక, స్టవ్ ఆపివేసి… తాజాగా దంచిన మిరియాల పొడిని వేసి ఒక్కసారి కలిపి దింపాలి. (మిరియాల పొడి ఎక్కువసేపు వేయించరాదు, అలా చేస్తే దాని ఘాటు, వాసన తగ్గిపోతుంది.)

ఈ పోపు మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, అన్నం విరగకుండా మెల్లగా కలపాలి. వేడి వేడిగా వడ్డించడానికి మిరియాల అన్నం సిద్ధం.

జలుబు నివారణకు : ఈ అన్నంలో ఉపయోగించే నల్ల మిరియాలలో ‘పైపెరైన్’ (Piperine) అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనమే జలుబు, దగ్గుకు ఉపశమనం ఇస్తుంది.

శ్లేష్మం తొలగింపు : మిరియాల ఘాటు, వేడి గుణం ముక్కు దిబ్బడను తక్షణమే తగ్గిస్తుంది. ఇది శ్లేష్మాన్ని (కఫం) కరిగించడంలో సహాయపడి, శ్వాస మార్గాలను తెరుస్తుంది.

యాంటీబయాటిక్ యాక్షన్: మిరియాలలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడతాయి.

శరీరానికి వేడి: జలుబు చేసినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఈ అన్నం తినడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..