AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boba tea: బాబోయ్‌ బబుల్‌ టీ.. ఎంత డేంజరో తెలిస్తే జన్మలో ముట్టుకోరు..!

నేటి యువతకు తినే ఆహారం, తీసుకునే డ్రింక్స్‌ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. వారు ఏం తింటారు, ఏం తాగుతారు అనేది ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారింది. ఈ క్రమంలోనే బబుల్‌ టీ దీనినే బోబాటీ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఈ రకం టీ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ట్రెండీ డ్రింక్స్‌ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్నారు. చిన్న టాపియోకా బాల్స్‌తో అలంకరించి అందించే ఈ టీ ఎంత రుచికరంగా ఉంటుందో... ఆరోగ్యానికి అంతే డేంజర్‌ అంటున్నారు వైద్య నిపుణులు. మీరు కూడా తరచూ బబుల్‌ టీ తాగుతున్నారా..? అయితే, ఎలాంటి నష్టాలున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Boba tea: బాబోయ్‌ బబుల్‌ టీ.. ఎంత డేంజరో తెలిస్తే జన్మలో ముట్టుకోరు..!
Bubble Tea
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2025 | 7:19 AM

Share

1980లలో తైవాన్‌లో బబుల్ టీని తయారు చేశారు. ఇది పాలు, టీ, చక్కెర సిరప్, టేస్టీ టపియోకా బాల్స్‌తో తయారు చేస్తారు. ఈ నల్లటి టపియోకా బాల్స్ వల్లే ఈ టీకి బోబా టీ అని పేరు వచ్చింది. వీటిని కర్రపెండలం దుంపతో తయారుచేస్తారు. వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో తయారుచేసిన ఈ టీలో.. నానబెట్టిన టాపియోకా గింజలని వేసి తయారుచేస్తారు. పైన జెల్స్‌తో చేసిన టాపింగ్స్‌ వేస్తారు. దీంతో ఈ టీకీ మరింత అందంగా, రుచిగా మారుస్తుంది. ఈ టాపియోకాలని తినడానికి వీలుగా ఇందులో వేసే స్ట్రాలు కూడా ప్రత్యేకంగా, లావుగా ఉంటాయి. తైవాన్‌లో ప్రాచుర్యం పొందిన ఈ టీ ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోంది.

కానీ, ఇటీవల, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. ఇందులో బోబా టీ అధికంగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరంగా చెప్పారు. బోబా టీ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

బబుల్ టీ ఎలా తయారు చేస్తారు?

బబుల్ టీ తయారు చేయడానికి, టపియోకా బాల్స్‌ని ముందుగా ఉడకబెట్టి వాటిని మృదువుగా, నమలడానికి ఈజీగా ఉండేలా చేస్తారు. తరువాత, టీ బేస్ తయారు చేస్తారు. ఇందులో సాధారణంగా బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా మిల్క్ టీ ఉంటాయి. చక్కెర సిరప్, పాలు, పలు రకాల ఫ్లేవర్స్‌ని యాడ్‌ చేస్తారు. . చివరగా, ఈ వేడి టపియోకా బాల్స్‌ని ఒక కప్పు అడుగున ఉంచి, టీ మిశ్రమాన్ని పైన పోస్తారు. బోబా బాల్స్ ప్రతి సిప్‌తో నోటిలోకి వచ్చేలా దీన్ని పెద్ద స్ట్రాతో తాగుతారు.

బబుల్ టీ మీ ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్‌ వివరణ

అమెరికాకు చెందిన హార్వర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో బబుల్ టీ అనారోగ్యకరమైనది మాత్రమే కాదు, కాలేయానికి కూడా హానికరం అని వివరించారు. యువతలో ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణంగా మారుతోందని చెప్పారు.. మీడియం సైజు బబుల్ టీలో దాదాపు 30 నుండి 55 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది కోకా-కోలా డబ్బా కంటే ఎక్కువ. కారామెల్ డ్రిజిల్, ఫ్రూట్ జెల్లీ లేదా సిరప్ వంటి టాపింగ్స్‌ను వేయటం వల్ల చక్కెర శాతం మరింత పెరుగుతుంది. ఈ అదనపు చక్కెర ఇన్సులిన్ స్పైక్‌లు, కొవ్వు నిల్వ, మొటిమలకు దారితీస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి…

డాక్టర్ సేథి ప్రకారం, ప్రతిసారి అధిక చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుంది. శరీరం అదనపు చక్కెరను జీర్ణం చేసుకోలేనప్పుడు, అది కాలేయంలో కొవ్వుగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. బబుల్ టీలో చక్కెర మాత్రమే కాకుండా కృత్రిమ రుచులు, రంగులు, ప్రిజర్వేటివ్‌లు కూడా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలంలో బరువు పెరగడానికి కారణమవుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం, మొటిమల వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు బబుల్ టీని అలవాటుగా చేసుకుంటే మాత్రం వెంటనే మానేయండి..అప్పుడప్పుడు తీసుకునే ట్రీట్‌గా మాత్రమే దీన్ని ఆస్వాదించండి. మీరు కావాలనుకుంటే సిరప్ లేకుండా, తక్కువ పాలు, ఎక్కువ గ్రీన్ టీతో తక్కువ చక్కెర వెర్షన్‌ను తయారు చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్