సోనూ సూద్ మంచి మనసు.. ఈ వృద్ధ జంటకు చేసిన సాయం తెలిస్తే..
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అందరికీ బాగా తెలుసు.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కోవిడ్ కాలంలో సోషల్ వర్క్ ద్వారా ప్రజలకు దేవుడయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయన సేవ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే గొప్ప గుణం సోనూ సూద్‌ది. తాజాగా మరోసారి అతను తన గొప్ప దానగుణం చూపించారు.

అందరికీ ఎల్లప్పుడూ సహాయం చేసే నటుడు సోను సూద్.. మరోమారు ఓ వృద్ధ జంటకు సాయం చేసి వార్తల్లో నిలిచారు. వృద్ధ దంపతులు స్వయంగా పొలం దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నటుడు సోను సూద్ వారికి భరోసా నిచ్చారు. పొలం దున్నేందుకు ఎద్దులు లేక.. తనను తాను ఎద్దుగా చేసుకుని నాగలి కట్టిన ఓ వృద్ధ రైతు జంటకు సహాయం అందిస్తానని మాటిచ్చాడు. ఆ వృద్ధ రైతుకు వ్యవసాయం కోసం అవసరమైన పశువులను అందిస్తానని చెప్పాడు.
हमारे इस किसान भाई को ट्रैक्टर चलाना नहीं आता इसलिए बैल ही बढ़िया है दोस्त। @SoodFoundation 🇮🇳 https://t.co/ZTmcYtQcLs
ఇవి కూడా చదవండి— sonu sood (@SonuSood) July 2, 2025
అతను రైతును సంప్రదించి ఒక జత ఎద్దులను ఇస్తానని హామీ ఇచ్చాడు. మీరు నాకు నంబర్ పంపండి, నేను మీకు కావాల్సిన పాడి పశువులను పంపుతాను అని అతను X లో వీడియోకు ప్రతిస్పందిస్తూ రాశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#WATCH | Maharashtra | An elderly farmer tills dry land by tying himself to traditional plough in drought-hit area in Latur pic.twitter.com/9geMReVGB0
— ANI (@ANI) July 2, 2025
వైరల్ వీడియోలో ఒక వృద్ధ జంట పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. వారి వద్ద ఎద్దు లేకపోవడంతో పెద్దాయన ఎద్దులకు బదులు కట్టి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ వృద్ధ జంట ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి వారు ఇలా చేయాల్సి వచ్చిందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత బాలీవుడ్ నుండి నటుడు సోనూ సూడ్ సహాయం అందించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..