Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్

కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్

Phani CH
|

Updated on: Jul 03, 2025 | 5:10 PM

Share

కాస్త ఎక్కువ భోజనం చేసిన ఓ మహిళకు కడుపునొప్పి మొదలైంది. ఏంటా అనుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన కాసేపటికే ఆమెకు నొప్పులు రావటం, మరికాసేపటికే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వటం జరిగిపోయింది. సినిమాటిక్‌గా జరిగిన ఈ ఘటన చైనాలో జరిగింది. మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్‌కు చెందిన ఎజౌ నగరంలో జూన్ 16న.. లీ అనే మహిళ మధ్యాహ్నం పూట కడుపునిండా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటోంది.

అంతలోనే కడుపు నొప్పిగా అనిపించటంతో 2 గంటల టైమ్‌లో.. తన ఎలక్ట్రిక్ బైక్‌ తీసి, నేరుగా ఆసుపత్రికి పోయి డాక్టరును కలిసింది. ఆమెను పరిక్షించిన డాక్టర్.. ఆమెను 9 నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఆ మాట విన్న లీ.. కాసేపటి వరకు లీ షాక్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత 10 నిమిషాలకే ఆమెకు ఉమ్మనీరు పోవడంత.. వైద్యులు అప్రమత్తమయ్యారు. ఆ కాసేపటికే ఆమె.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రికి వచ్చిన గంటలోనే ఈ పరిణామాలన్నీ జరిగిపోవడంతో అక్కడి డాక్టర్లు, లీ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తన పెద్ద కొడుకుకు ఆరేళ్ల వయసుందని, తాము రెండో బిడ్డ గురించి అసలు ప్లానింగ్ చేసుకోనేలేదని, ఇదంతా మాయగా ఉందని లీ చెప్పుకొచ్చింది. ప్రసవ సమయంలో తన భర్త ఊర్లో లేరని చెప్పారు. తొలి కాన్పు సమయంలో తనకు వేవిళ్లు ఉండేవని, ఈసారి అసలు అలాంటి లక్షణాలే లేవని లీ చెప్పుకొచ్చింది. తనకు నెలసరి కూడా ఎప్పుడూ క్రమపద్ధతిలో రాదని, ఈ క్రమంలో చాలాకాలంగా నెలసరి రాకున్నా.. తాను పట్టించుకోలేదని వెల్లడించింది. కాస్త బరువు పెరిగినట్లు అనిపించినా.. తాను గర్భిణిననే అనుమానం మాత్రం ఎన్నడూ రాలేదని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బేషరతుగా.. నన్ను క్షమించమని అడిగిన నితిన్.. కారణం..

నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా ?? పవన్ ఫ్యాన్స్‌లో హైటెన్షన్…

Chiranjeevi: ఒక్కసారిగా.. తమ్ముడిని సర్‌ప్రైజ్‌ చేసిన మెగాస్టార్

ఇదేం రీల్స్‌ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్‌ టెర్రస్‌పై నుండి మహిళ..??

లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు