ఇదేం రీల్స్ పిచ్చి.. 20 అంతస్థుల బిల్డింగ్ టెర్రస్‌పై నుండి మహిళ..??
బీహార్ నుంచి వలస వచ్చి ఎన్నో కలలతో బెంగళూరులో సేల్స్‌గళ్‌గా ఉద్యోగం చేస్తున్న యువతి జీవితం రీల్స్ మోజులో పడి అర్థాంతరంగా ముగిసింది. షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న బీహార్ యువతి రీల్ షూట్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ బిల్డింగ్ టెర్రస్ నుంచి కింద పడి మృతి చెందింది. ఇంతకీ ఏం జరిగిందంటే బెంగళూరులోని పరప్పన అగ్రహారలో యువతి స్నేహితుల బృందం ఇటీవల ఓ రాత్రి పార్టీ చేసుకున్నారు.
పార్టీ చేసుకునేందుకు వీరంతా నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్థుకు చేరుకున్నారు. పార్టీ ముగిసిన తర్వాత అంతా కలిసి మరో ఐదు ఫ్లోర్లపైన ఉన్న టెర్రస్‌పైకి వెళ్లారు. టెర్రస్‌పై వీరి మధ్య ఏదో అంశంపై వాగ్వాదం మొదలైంది. రెండు గ్రూపులుగా విడిపోయి వాదులాడుకున్నారు. ఈ ఉదంతాన్ని యువతి సాడ్ రీల్‌లా తీయాలనుకుందనీ, రీల్ షూట్ చేసే క్రమంలో బిల్డర్ లిఫ్ట్ కోసం వదిలిపెట్టిన ఖాళీ స్థలంలో కాలు పెట్టి ప్రమాదవశాత్తూ పడిపోయినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. ఊహించని హఠాత్ పరిణామంతో అక్కడున్న స్నేహితులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారనీ ఆ తర్వాత వెంటనే పరారయ్యారని తెలిపారు. అయితే యువతి ప్రమాదవశాత్తూ పడిందా లేక ఎవరైనా తోసేసారా అన్న కోణం నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ ఫాలిమా తెలిపారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లక్కీ భాస్కర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు.. 100 కోట్ల మూవీ రాసిపెట్టలేదు
కన్నప్ప సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్,కాజల్,అక్షయ్‌ల దిమ్మ తిరిగే రెమ్యునరేషన్
కంగారు కైకు.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. చివరికి
ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.
క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
