క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే
మీరు క్రెడిట్ కార్డ్, లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఇక మీరు మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ స్కోరు ఆధారంగానే మీ లోన్ రీపేమెంట్ కెపాసిటీని డిసైడ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ క్రెడిట్ స్కోర్ అత్యంత కీలకం కానుంది. 300 నుండి 900 మధ్య ఉండే ఈ క్రెడిట్ స్కోరును బట్టి.. మీకు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా లేదా అనేది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి.
మనదేశంలో నాలుగు ప్రధాన క్రెడిట్ స్కోరు ఏజెన్సీలు ఉన్నాయి. అవి.. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ మరియు సిఆర్‌ఐఎఫ్ హైమార్క్. ఈ ఏజెన్సీలు దేశంలోని వ్యక్తుల క్రెడిట్ చరిత్రను సేకరించి, క్రెడిట్ స్కోర్‌లను లెక్కిస్తాయి. ఈ స్కోర్‌లను ఉపయోగించి వ్యక్తులు పెట్టుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్టు వంటివి ఇవ్వాలా లేదా అనే దానిని ఈ ఏజెన్సీలు నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోరు 300 నుండి 900 వరకు ఉంటుంది. ఇందులో 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే.. రుణాలు మరియు క్రెడిట్ కార్డులు పొందడం సులభం. పైగా, వీరికి కాస్త తక్కువ వడ్డీకే రుణాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేగాక.. వీరు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ప్రయాణ ప్రయోజనాలు మరియు ఇతర ప్రత్యేక ఆఫర్‌లను కూడా పొందే అవకాశం ఉంటుంది. అందుకే , మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోడానికి EMIలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించండి.పరిమితికి మించి క్రెడిట్ కార్డ్ వాడటం మానేయండి. ఆర్థిక క్రమశిక్షణే మీకు రేపటి రోజున అప్పు పుట్టేందుకు కొలమానం అని తెలుసుకోండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి.. నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్ !!
కనీసం ముగ్గురు పిల్లల్ని అయిన కనండి మాహప్రభో.. మస్క్ ఆవేదన
లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్
అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..
పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
