Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్

లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్

Phani CH
|

Updated on: Jul 01, 2025 | 6:55 PM

Share

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది దిల్ రాజు భార్య తేజస్విని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. ఇటీవల తన భర్తతో కలిసి పారిస్ వెకేషన్‌కు వెళ్లొచ్చిన ఆమె.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు, దిల్ రాజుతో పెళ్లి తర్వాత తొలిసారిగా ఆమె ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన చాలా విషయాలపై ఓపెన్‌గా మాట్లాడింది. తాను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని, సెయింట్ ఆన్స్‌లో స్కూలింగ్, శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చేశానని తేజస్విని వెల్లడించింది.ఆ తర్వాత కస్తూరి బా గాంధీ కాలేజీలో డిగ్రీ, నాచారం సెయింట్ పియస్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో పిజి చేసింది. ‘మా అమ్మ హైకోర్టు అడ్వొకేట్ కావటంత.. ఆమె కోరిక మేరకు పెండెకంటి లా కాలేజీలో లా చదివాను’ అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని. లా చదువుతున్నప్పుడే దిల్ రాజుతో వివాహమైందని.. పెళ్లి తర్వాత కూడా స్టడీ కొనసాగించి, 2024లో లా డిగ్రీ తీసుకున్నట్లు రివీల్ చేసింది. స్టడీస్ లో మంచి స్టూడెంట్ నే అని చెప్పుకొచ్చింది తేజస్విని. ఇక.. తేజస్వినికి క్లాసికల్ డ్యాన్స్‌లోనూ మంచి ప్రావీణ్యముంది. గతంలో ఆమె పలు పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చింది. ఇక.. తన వివాహం గురించి చెబుతూ.. ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తమ కుటుంబానికి సినిమా రంగంతో సంబంధాలేమీ లేవని, ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చూసే వాళ్లమని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో తాను.. దిల్ రాజుని డైరెక్టర్ అనుకున్నానని, తర్వాత ఆయన నిర్మాత అని తెలుసుకున్నట్లు వెల్లడించింది తేజస్విని. తమ తొలి పరిచయంఫ్లైట్ లో జరిగిందని, తర్వాత అది ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ‘మీ ఇంట్లో ఎవరిని ఒప్పించాలో చెబితే.. వాళ్లతో మాట్లాడతా’అని దిల్ రాజే ఓ రోజు అడిగారని గుర్తుచేసుకుంది. కానీ, తమ ఇంట్లో మేనమామలు, పిన్ని వాళ్లంతా ఎవరూ. తమ పెళ్లికి ఒప్పుకోలేదని.. అందులోను రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారని, కానీ, అందర్నీ ఒప్పించి తాము పెళ్లి చేసుకున్నామని అసలు విషయం చెప్పుకొచ్చింది తేజస్విని.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..

పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..

చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్‌

కన్నప్ప నయా రికార్డ్ !! ఆదివారం ఒక్కరోజే 40% ఆక్యుపెన్సీ..

నెట్టింట లీకైన కన్నప్ప మూవీ.. ఎమోషనల్ అయిన విష్ణు