Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి.. నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్ !!

చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి.. నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్ !!

Phani CH
|

Updated on: Jul 01, 2025 | 7:38 PM

Share

రాఘవ లారెన్స్.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా దక్షిణాది సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించారు. కానీ కొన్నాళ్లుగా లారెన్స్ సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఎందరినో ఆదుకుంటున్న మనసున్న మనిషిగానూ లారెన్స్ గుర్తింపు పొందాడు.

సొంతంగా ఆశ్రమాలు కట్టి, ఎందరో అనాథలు,వృద్ధులు,పేదలకు నీడనిచ్చారు. ఎందరో అనాథలకు అన్నగా నిలిచి, వారికి చదువు చెప్పించి, ప్రయోజకులను చేసిన ఘనతా లారెన్స్‌కు ఉంది. అయితే మాస్.. సినిమా టైంలో రవి రాథోడ్ అనే.. ఓ చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకుని లారెన్స్ చదివించాడు. అయితే, అతడి పరిస్థితి తారుమారు కావటంతో.. మళ్లీ తన దగ్గరకు వచ్చేయమని లారెన్స్ కబురంపాడు. విక్రమార్కుడు, మాస్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రవి రాథోడ్. మాస్ సినిమా సమయంలోనే రవి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీంతో ఆ పిల్లాడిని.. లారెన్స్ దత్తత తీసుకుని, బడిలో చేర్చి సాయం చేశాడు. కానీ, ఆ పిల్లాడు బడిలో నుంచి తప్పించుకుని పోవటంతో అతడి కోసం లారెన్స్ వెతుకుతూనే వచ్చారు. తాజాగా ఆ పిల్లాడి జాడ దొరకడంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు లారెన్స్. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు రవి రాథోడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో లారెన్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే కొడతారో.. తిడతారో అనే భయం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో కాస్తా.. లారెన్స్ దగ్గరకు చేరింది. ఇది చూసిన లారెన్స్ తనను కలవాలని ట్వీట్ చేశారు. ‘నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్లు ఆగడం లేదు. మాస్ సినిమా టైంలో నిన్ను బడిలో చేర్చాను. మరుసటి ఏడాది నుంచి నువ్వు కనిపించకుండా పోయావు. నాటి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను. మళ్లీ నిన్ను చూడడం సంతోషంగా ఉందిరా.. నేనేమీ అనను. ఒకసారి వచ్చి కలువు. నిన్ను చూడాలి’ అంటూ ట్వీట్ చేశారు లారెన్స్. ప్రస్తుతం ఆయన వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనీసం ముగ్గురు పిల్లల్ని అయిన కనండి మాహప్రభో.. మస్క్ ఆవేదన

లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్

అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..

పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..

చిల్లర లేదన్న ప్రయాణికుడు.. చితక బాదిన మహిళా కండక్టర్‌