Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి.. నాలుగో పెళ్లా !! పెళ్లి వీడియోతో షాకిచ్చిన నటి !!

ఏంటి.. నాలుగో పెళ్లా !! పెళ్లి వీడియోతో షాకిచ్చిన నటి !!

Phani CH
|

Updated on: Jul 01, 2025 | 7:40 PM

Share

అమ్మానాన్నలిద్దరూ దిగ్గజ నటీనటులు కావడంతో ఈ అమ్మడు కూడా వారి బాటలోనే నడిచింది. హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది.

అయితే ఆ తర్వాతి కాలంలో ఈ అమ్మడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లిళ్ల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని, ముగ్గురికీ విడాకులిచ్చిన ఈ నటి..తాజాగా నాలుగో పెళ్లి కూడా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అదే వీడియో.. ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కోలీవుడ్ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేవి సినిమాతో హీరోయిన్ గా మెప్పించిన ఈ అందాల తార ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ, ఆ మూడు పెళ్లిళ్లూ ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటోన్న ఆమె ‘మిసెస్ & మిస్టర్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా వనితనే దర్శకత్వం వహిస్తుండగా.. నటి కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమా అప్ డేట్ లో భాగంగా శుభ ముహూర్తం.. అనే సాంగ్ ను రిలీజ్ చేశారు ఈమూవీ మేకర్స్. ఇందులో భాగంగానే వీరు రీల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఆ పాట చూసిన అందరూ.. వనిత.. మళ్లీ పెళ్లి చేసుకుందాం ఏంటి.. అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి.. నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్ !!

కనీసం ముగ్గురు పిల్లల్ని అయిన కనండి మాహప్రభో.. మస్క్ ఆవేదన

లాయర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇంకా చాలా..! దిల్ రాజు వైఫ్‌ది దిమ్మతిరిగే బ్యాక్ గ్రౌండ్

అందం కోసం ప్రాణాల మీదికి.. పిచ్చి పని చేసిన హీరోయిన్..

పెళ్లి పేరుతో ఎవరికో నా ఆస్తి ఇవ్వలేను! అందుకే పెళ్లి చేసుకోను..