నెట్టింట లీకైన కన్నప్ప మూవీ.. ఎమోషనల్ అయిన విష్ణు
భారీ బడ్జెట్.. భారీ క్యాస్టింగ్‌తో ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మించిన పీరియాడికల్ డ్రామా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోస్ ఇందులో నటించటంతో ముందు నుంచే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూశారు ఫ్యాన్స్. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి షో నుంచే భారీ వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి విష్ణు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. కన్నప్ప సినిమా పైరసీకి గురవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సినిమా తీశామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. కన్నప్ప సినిమాపై పైరసీ దాడి జరిగిందని చెప్పిన విష్ణు.. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్స్ తొలగించామన్నాడు. ‘ఇది చాలా బాధాకరంగా ఉంది. పైరసీ అంటే దొంగతనమే. మన ఇంట్లో పిల్లలకు మనమే దొంగతనం చేయమని చెప్పం కదా..కనుక దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా కన్నప్ప మూవీని ఆదరించండి’ అంటూ మంచు విష్ణు అందరికీ రిక్వెస్ట్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇవే.. నా లైఫ్‌లో హ్యాపీడేస్.. పెళ్లి తర్వాత అఖిల్ మొదటి పోస్ట్!
రుద్ర క్యారెక్టర్.. ప్రభాస్ కాదు.. ఆ స్టార్ హీరో చేయాల్సింది
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..! విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిల..

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
