Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

కన్నప్ప నయా రికార్డ్.. ప్రశంసలు కురిపిస్తున్న టాలీవుడ్

Samatha J
|

Updated on: Jul 01, 2025 | 4:00 PM

Share

కన్నప్ప నయా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్స్‌కు జనాలు రావడం లేదంటూ... థియేటర్స్ ఓనర్స్ గగ్గోలు పెడుతున్న వేళ... మంచి ఆక్యూపెన్సీని రాబట్టింది. ఇక అకార్డింగ్‌ టూ ఇంటర్నల్ న్యూస్,కన్నప్ప మూవీ డే1, రూ.20 కోట్లు వసూలు చేయగా, తాజాగా మూడవ రోజు,రూ.7.25 కోట్లు వసూలు చేసింది. అయితే శనివారం కంటే ఆదివారం అంటే జూన్ 29 ఒక్కరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ ఒక్క రోజే 39.93% ఆక్యుపెన్సీని సాధించింది.

కన్నప్ప, కుబేర చిత్రాలు వారం రోజుల వ్యవధిలోనే ఆడియన్స్ ముందుకు రాగా, ఈ రెండూ మంచి కలెక్షన్లు రాబట్టాయి. విడుదలైన మొదటి మూడు రోజుల స్క్రీనింగ్‌తో పోల్చి చూస్తే, కుబేర సినిమా రూ. 48.6 కోట్లు వసూలు చేయగా, కన్నప్ప రూ. 23.75 కోట్లు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా ప్రస్తుతం కన్నప్ప టీమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వేళ… మంచు విష్ణు తన సినిమాపై కుట్ర జరుగుతోందంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు. తన మూవీని కొందరు పైరసీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నాడు. ‘దయచేసి కన్నప్పను పైరసీ చేయకండి. కన్నప్ప సినిమాను అనధికారికంగా పైరసీ చేసిన 30వేలకు పైగా లింకులను మా టీమ్ తొలగించింది. అయినా ఇంకా లింకులు వస్తూనే ఉన్నాయి. ఇలా పైరసీ చేయడం కూడా దొంగతనమే అవుతుంది. మన ఇంట్లో పిల్లలను దొంగతనం చేయమని చెబుతామా.. ఇలా పైరసీ చేయడం దొంగతనం కిందకే వస్తుంది. కన్నప్పను పైరసీ చేయొద్దు. థియేటర్లలో చూసి ఆదరించండి. కన్నప్ప లాంటి గొప్ప కథను థియేటర్లలో చూసి ఆదరించండి’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు మంచు విష్ణు.

మరిన్నివీడియోల కోసం :

ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్‌..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్‌

డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్


                    
Published on: Jul 01, 2025 03:42 PM