Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యానిమల్ ఎఫెక్ట్.. హరిహరలో మారిన బాబీ డియోల్ క్యారెక్టర్ వీడియో

యానిమల్ ఎఫెక్ట్.. హరిహరలో మారిన బాబీ డియోల్ క్యారెక్టర్ వీడియో

Samatha J
|

Updated on: Jul 01, 2025 | 3:32 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి పాటలు, ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక.. జూలై 3న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బాబీ డియోల్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అంశం బయటికి వచ్చింది.

‘యానిమల్’ మూవీలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ హరిహరవీరమల్లు చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి, షూటింగ్ మొదలైన తొలి రోజుల్లోనే బాబీ రోల్‌కి సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేశారు. కాగా, యానిమల్ మూవీ తర్వాత.. బాబీ రోల్ విషయంలో దర్శకుడు జ్యోతి కృష్ణ మనసు మార్చుకుని మరో బ్రహ్మాండమైన రోల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు బాబీ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారనే టాక్ నడుస్తోంది.ఇదే విషయాన్ని డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. యానిమల్ చిత్రం చూసిన తర్వాత… బాబీ డియోల్ పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇచ్చామన్నాడు. అంతేకాదు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పాత్రలో బాబీ చూపే భావోద్వేగాలు బలంగా ఉండేలా చూశారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.

మరిన్నివీడియోల కోసం :

ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్‌..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్‌

డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్

Published on: Jul 01, 2025 03:23 PM