Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 3:35 PM

Share

సాధారణంగా అడవికి రారాజు సింహం అయితే.. పులులు, చిరుత పులులు డిప్యూటీలు అని చెప్పుకోవచ్చు. అవి కనిపిస్తే చాలు ఎంత పెద్ద జంతువైనా జడుసుకోవాల్సిందే. ఇక అడవిలో తప్పిపోయిన ఆవులు, ఎద్దులైతే వాటికి ఆహారంగా మారాల్సిందే. అలాంటిది రెండు చిరుతలను ఓ ఒంటరి ఎద్దు తరిమిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్‌ను షాక్‌కి గురి చేస్తుంది. ఈ వీడియోలో రెండు చిరుతల నుంచి తనను తాను ఎంతో తెలివిగా కాపాడుకోడానికి ఎవరూ ఊహించని పని చేసింది ఆఎద్దు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అటవీప్రాంతంలో ఓ ఎద్దు ఓ రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తోంది. దారిలో దానికి రెండు చిరుతపులులు కనిపించాయి. వాటిని చూడగానే ఎద్దుకు కాస్త కంగారు పుట్టినా.. అది ఏమాత్రం పైకి కనబడనీయకుండా ముందుకు నడిచింది. చిరుతలకు దగ్గరగా వచ్చేటప్పటికి వేగం పెంచింది. వేగంగా అడుగులేసుకుంటూ వస్తున్న ఆ ఎద్దును చూడగానే ఈ చిరుతలకు కంగారు పుట్టింది. అయినా ఎద్దును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా దాని ముందుకు వచ్చాయి. చిరుతల తీరులో భయాన్ని గమనించిన ఎద్దు వాటిని మరింత భయపెడుతూ తన కొమ్ములతో వాటిని పొడిచేందుకు వెళ్లింది. విషయం అర్ధమైన చిరుతలు తోకముడుచుకొని పరుగందుకున్నాయి. భయంతో దట్టమైన అడవిలోకి పారిపోయాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిరుతలు ఓ ఎద్దుకు భయపడటమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఒక యూజర్.. అడవిలో చిరుత ఉనికి కూడా ఎద్దు వల్ల ప్రమాదంలో ఉంది అంటూ పోస్టు పెట్టాడు. . “చిరుత వేరే మూడ్‌లో ఉందనుకుంటా, లేకుంటే అదే ఆ ఎద్దు చివరి రోజు అయ్యేది” అని మరొకరు రాశారు.

మరిన్ని వీడియోల కోసం :

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో