Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

సబ్బుల కోసం ఆగమాగం.. చివరికి మనిషి చనిపోయినా.. వీడియో

Samatha J
|

Updated on: Jun 29, 2025 | 3:25 PM

Share

మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. కనుమరుగుతున్న మానవ విలువలకు రుజువుగా నిలుస్తోంది. ఓ కంపెనీ సబ్బుల లోడుతో వెళుతోన్న ఓ లారీ, ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఆ వాహనాలు రెండూ బోల్తా కొట్టాయి. ప్రమాద తీవ్రత కారణంగా వాహనాల కేబిన్‌లు నుజ్జునుజ్జుగా మారి, డ్రైవర్లు అందులోనే ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించారు. అయితే, సబ్బుల లారీ పడిందనే సమాచారంతో సమీప ప్రాంతాల ప్రజలంతా పొలోమని వచ్చి.. దొరికినన్ని సబ్బు పెట్టెలను తీసుకుపోయే ప్రయత్నంలో మునిగిపోయారు గానీ, వారిలో ఏ ఒక్కరూ.. ఆ డ్రైవర్లను బయటకి తీసే ప్రయత్నం గానీ, పోలీసులకు సమాచారం అందించాలనే ఆలోచన చేయలేదు. ఈ విచారకర సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సబ్బుల లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ అక్కడిక్కడే మరణించగా, వేరే వాహనం డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ, అక్కడికి చేరిన జనం మాత్రం ఇవేమి పట్టించుకోకుండా లారీలోని సబ్బులను చేతబుచ్చుకుని పోయారు. ఇరుకు రోడ్డు కావటంతో అక్కడంతా ట్రాఫిక్ జాం కావటంతో.. కాసేపటికి అక్కడికి చేరిన పెట్రోలింగ్ సిబ్బంది.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ , క్లీనర్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ ఓనర్లకు సమాచారమిచ్చి, ఆ మిగిలిన సంతూర్ సబ్బుల లోడ్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. తీవ్రమైన గాయాలతో, సాయం కోసం బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తున్న డ్రైవర్, క్లీనర్‌లను పట్టించుకోకుండా, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సబ్బులను ఎత్తుకెళ్లిన స్థానికుల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు వీడియోలో.. కొందరైతే.. తమకు ఎక్కువ సబ్బులు దొరికాయంటూ… సంతోషంతో ఉప్పొంగిపోతూ సబ్బుల బాక్స్‌లను ఎత్తుకెళ్లడం చూసి.. మానవత్వం లేని మనుషులు అని నెటిజన్లు చీదరించుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

పుడమి తల్లికి రుతుచక్రం..కామాఖ్య తలుపులు ఆ 5 రోజులు మూసివేత వీడియో

కరెంట్ పోల్ పైన పక్షి గూళ్లు .. ఆఫ్రికాలో అద్భుతం వీడియో

బ్యాచ్ లర్స్‌.. ఇది మీ కోసమే వీడియో